fbpx

వైసిపి అవినీతిపై బిజెపి ఎందుకు చర్యలు తీసుకోలేదు ? : షర్మిల

Share the content

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానిస్తున్నారు…మరి ఐదేళ్లుగా వైసిపి ప్రభుత్వ అవినీతిపై బిజెపి కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ప్రశ్నించారు. సోమవారం కడపలో ఇండియా కూటమి కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ షర్మిలకు సిపిఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిలు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ…బిజెపితో చంద్రబాబు బహిరంగ పొత్తు పెట్టుకుంటే…గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి అక్రమ పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మోదీకి దత్తపుత్రుడని సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారని గుర్తు చేశారు. కేవలం బిజెపికి తొత్తుగా ఉన్నారనే కారణంతో జగన్మోహన్ రెడ్డిపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఎద్దేవా చేశారు. రాజశేఖర్ రెడ్డి వారసుడు కంటే మోదీ దత్త పుత్రుడుగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని బిజెపి బహిరంగంగా చెబుతున్నా టీడిపి,వైసిపి లు ఎలా మద్దతు తెలుపుతాయని నిలదీశారు. గత ఐదేళ్లుగా అనేక బిల్లుల విషయంలో వైసిపి మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు. బిజెపికి చెందిన అదానీ, అంబానీ లకు వైసిపి గంగవరం కోర్టును కట్టబెట్టారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి పది ఏండ్లు అయ్యింది. ఈ పది ఏళ్లలో రాష్ట్రానికి బిజెపి ఇచ్చిన ఒక్క హామిని కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి మంచి చేయాలన్న చిత్తశుద్ధి బిజెపికి ఉంటే ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఎదురించగల సామర్థ్యం ఇండియా కూటమికి మాత్రమేవుందని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *