fbpx

రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కృషి : షర్మిల

Share the content

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్. షర్మిళ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఢిల్లీలో అక్బర్ రోడ్ వద్ద ఏఐసిసి కార్యాలయంలో గురువారం ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లు ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ వై.యస్.ఆర్ తెలంగాణ పార్టీ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దేశంలో అతి పెద్ద సెక్యూలర్ పార్టీ అని తెలిపారు. దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసింది కాంగ్రెస్ పార్టీ నేనని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చివరి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం పోరాటం చేశారన్నారు. ఆయన కూతురిగా కాంగ్రెస్ లో చేరినదుకు గర్వకారణంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ ను ప్రధానిగా చూడాలని తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మనస్పూర్తిగా కొరుకున్నానన్నారు. ఆయన కలను నెరవేర్చే విధంగా కృషి చేస్తానని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర తో రాహుల్ గాంధీ తనలో ఆత్మ విశ్వాసం నింపారన్నారు.ఆ యాత్ర వలనేకర్ణాటక ,తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ భాధ్యత ఇచ్చినా పని చేస్తానని వెల్లడించారు. పార్టీ ఆదేశం మేరకు ఆంధ్రాలోనే కాదు అండమాన్ లో అయిన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

  • కాంగ్రెస్ కండువాను తిరస్కరించిన అనిల్ కుమార్
    ఏఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే షర్మిళను పార్టీలోకి ఆహ్వానించిన అనం తరం కీలక పరిణామం చోటు చేసుకుంది. షర్మిల భర్త అనిల్ కుమార్ కు కాంగ్రెస్ కండువా వేసేందుకు ఖర్గే ప్రయత్నించగా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రాహుల్ గాంధీ కూడా కండువా వేసేందుకు ముందుకు రాగ ఖర్గే రాహుల్ ను ఆపారు.ఆ కండువాను షర్మిళ మెడలో రాహుల్ గాంధీ వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *