fbpx

దేనికి సిద్ధం సార్ ? ల్యాండ్,శాండ్,మైనింగ్ మాఫియాలతో దోచుకోవడానికా? : షర్మిల

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని అంటున్నారు.. దేనికి సిద్ధం సార్….మళ్ళీ రాష్ట్రం మీద ఎనిమిది లక్షల కోట్లు భారం వేయటానికి సిద్దమా? మళ్ళీ బిజెపి తో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్దమా? బిజెపి వద్ద ప్రత్యేక హోద తాకట్టు పెట్టడానికి సిద్దమా?ఇసుక,లిక్కర్, మైనింగ్ మాఫియా లతో దోచుకోవడానికి సిద్దమా? అని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల ప్రశ్నించారు. అందుకే మీరు సిద్ధం ఐతే ప్రజలు కూడా మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. బుధవారం బాపట్ల లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ…కేంద్ర బీజీపీ ప్రభుత్వం పది ఏళ్లుగా రాష్ట్రానికి ఒక్క హామీను కూడా నిలపెట్టుకొలేదు..జగన్మోహన్ రెడ్డి అధికారంలో కి వచ్చిన వెంటనే…మెజార్టీ తక్కువ వస్తె డిమాండ్ చేసే వాళ్ళము అని అన్నారు.ఇప్పుడేమో 360 సీట్లు వస్తున్నాయి ..ఇప్పుడు డిమాండ్ చేసే పరిస్థితీ కూడా ఉండదు అని అంటున్నారు.ఎలక్షన్స్ కాకముందే బిజెపి గెలిచేసినట్లు చెప్పేస్తున్నారు.అసలు ప్రత్యేక హోదా తీసుకురావటం వీరి వలన అవుతుందా? ప్రజలకు ఏం సమాధానం చెపుతారు అని ప్రశ్నించారు.

ఒక్క సారి అయినా ప్రత్యేక హోదా కోసం.. పోలవరం గురుంచి మాట్లాడారా ? మాకు పోలవరం ఎందుకు కట్టడం లేదే అని కేంద్రాన్ని నిలదీశారా? అని ప్రశ్నించారు….నా గుండెల్లో నిజాయతీ ఉంది…నా పుట్టింటికి మేలు చేయాలన్న తపన నాలో ఉంది.అందుకే ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టింది రాజశేఖర్ బిడ్డ అని పేర్కొన్నారు. పోలవరం పూర్తి అయ్యేవంత వరకు కొట్లడతాము….స్పెషల్ స్టేటస్ వచ్చే వరకు కోట్లడతాము …రాజధాని సాకారం అయ్యేంతవరకు కొట్లాడతాము.అని ధీమా వ్యక్తం చేశారు..ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు హక్కు అయిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టే వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు అని వెల్లడించారు.

టిడిపి…వైసిపి పొత్తు పార్టీలు… బిజెపికి తోత్తు పార్టీలు.

రానున్న ఎన్నికల్లో వైసిపి,టిడిపి,జనసేన పార్టీలకు వేసే ప్రతి ఓటు ఎన్నికల తరువాత బిజెపి కి పడుతుంది…మళ్ళీ బిజెపి అధికారం లోకి వస్తే మళ్ళీ ప్రత్యేక హోదా,రాజధాని అంశాలపై మాట్లాడరు…మన హక్కులు గురుంచి మాట్లాడరు….బీజీపీ అంటే మన రాష్ట్రంలో బాబు జగన్ పవన్ అని ఎద్దేవా చేశారు.పోలవరం పూర్తి కావటానికి జగన్..చంద్రబాబు ఒక్క నిజమైన ఉద్యమం చేశారా? ప్రతిపక్షం లో ఉండగా.. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడిగా రాజీనామ చేద్దాం అన్నారు.. మరి మీరే ముఖ్యమంత్రి అయ్యాక మూకుమ్మడిగా ఎంత మంది రాజీనామ చేశారు? అని ప్రశ్నించారు.

రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి…జగనన్న….. కోట నుంచి బయటకు రారు…

రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషి,ప్రజలకు కష్టం వస్తె క్షణాల్లో వచ్చేవారు..ఇప్పుడు జగనన్న పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు….ఎప్పుడు ప్రజల మధ్యలోకి రారు…ఇప్పుడు ఎలక్షన్స్ అన్ని బయటకి వస్తున్నారని ఎద్దేవా చేశారు.రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతే రాజు.వ్యవసాయం ఒక పండుగ.రైతులకు రుణ మాఫీ చేశారు.పంట నష్టపోతే నష్టం పరిహారం ఇచ్చారు…ఇప్పుడు జగనన్న ప్రభుత్వం కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు….ఇప్పటి వరకు ఎన్ని జాబ్ కాలెండర్ లు విడుదల చేశారు?పూర్తి మధ్య పాన నిషేధం చేస్తాను అన్నారు..ఆ తరువాతే వచ్చి ఓట్లు అడుగుతాను అన్ని అన్నారు ..మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్ ,భగవద్గీత అన్నారు..మరి నేడు ఏమైంది జగనన్న అని ప్రశ్నించారు. తెచ్చారు…తెచ్చారు…మద్యం తో స్పెషల్ స్టేటస్ తెచ్చారు.ఇదేనా మాట నిలబెట్టుకోవటం అంటే?మద్యం షాప్ లో పోతే క్యాష్ పేమెంట్ లు అని అంటున్నారు. రాష్ట్రానికి వచ్చే పన్నులు రావడం లేదు…కేంద్రంకు వెళ్ళే పన్నులు పోవడం లేదు…ఐనా కూడా పూర్తి అక్రమంగా, యదేచ్ఛగా మద్యం అమ్ముతున్నారు అని మండిపడ్డారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని..ఉద్యోగులకు పాత పద్ధతి అయిన ఓపిఎస్ ను తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *