fbpx

కాంగ్రెస్ కథ కంచికే!

Share the content

కాంగ్రెస్ కోలుకోవటం ఇప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో సాధ్యమేనా అన్న ప్రశ్న రాజకీయ వర్గాల్లో తరచూ వినిపిస్తోంది. 2024 సాధారణ ఎన్నికలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశం మీద జోరుగా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కనిపించకుండా పోయిన తరుణంలో నాయకులు ఒక్కొక్కరుగా జారిపోయారు. అడపాదడపా పాత తరం నాయకులు ఉన్నప్పటికీ వారంతా సైలెంట్ అయిపోయారు. చాలామందికి కాంగ్రెస్ పరిస్థితి అర్థమై రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదు అని భావించి ఇతర పార్టీలోకి వెళ్లిపోయారు. అయితే వచ్చే ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నది కూడా ఇప్పుడు ఆ పార్టీ పాతతరం కార్యకర్తల్లో భయం పట్టుకుంది. 2019 ఎన్నికల్లోనే పోటీ చేసేందుకు కనీసం అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో మరింత ధ్యానమైన పరిస్థితిని ఎదుర్కొనే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కనీసం ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కనీసం ఆ పార్టీ నుంచి వచ్చే సాధారణ ఓట్లు ఆశించేందుకు కూడా ఏ పార్టీలు ముందుకు రాకపోవడం విశేషం.

కర్ణాటక ఎన్నికల తర్వాత ఏమాత్రం పరిస్థితి మారలేదు

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏమైనా మార్పు వస్తుందా అని అంత గమనించిన ఫలితం లేకపోయింది. కాంగ్రెస్ పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న రఘువీరారెడ్డి, చింతామోహన్, పల్లంరాజు వంటి నాయకులు పూర్తిగా సైలెంట్ అయిపోవడం మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం వంటివి కాంగ్రెస్ను మరింత నిర్వీర్యం చేసేలా కనిపించాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పగ్గాలు అందుకునేందుకు కూడా నేతలు ఎవరు ముందుకు రాకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పార్టీని గాడిలో పెట్టే అవకాశం ఇప్పట్లో లేనట్లేనని సీనియర్ నాయకులు కూడా వ్యాఖ్యానించడం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ అసలు చేస్తుందా లేదా అన్న అనుమానానికి బీజం వేస్తోంది.

ఆ ఓట్లు టర్న్ అవుతాయా?

గతంలో ఎంతో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వైసీపీ ఆవిర్భావం తర్వాత పూర్తిగా డీలా పడింది. రాష్ట్ర విభజన దెబ్బతో పాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జగన్ బయటకు వచ్చి సొంతంగా పార్టీ నేల కోల్పోవడం ఆ పార్టీని కోల్కోలేని దెబ్బకు గురి చేసింది. కాంగ్రెస్ తో పాటు ఎప్పుడూ ఉండే దళితులు మైనార్టీ ఓట్లు అన్ని వైసీపీకు టర్న్ అయ్యాయి. దీంతోపాటు కాంగ్రెస్కు పట్టణ ప్రాంతాలు కూడా వైసిపి పరం అయ్యాయి. దీంతో కాంగ్రెస్ కు బలమైన ప్రత్యామ్నాయంగా ఓటర్లకు వైసీపీ కనిపించింది. దీంతో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ఓట్లు వైసీపీ వైపు వెళ్లాయి. మళ్లీ కాంగ్రెస్ పార్టీ కాస్తో కోస్తూ బలం పుంజుకోవాలంటే కచ్చితంగా వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగలడం, రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి నిలిపితేనే ఇది సాధ్యం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *