fbpx

కాంగ్రెస్ అస్త్రం షర్మిల

Share the content

ఆంధ్రప్రదేశ్లో మళ్లీ కాంగ్రెస్ పుంజుకోవడానికి అస్త్రాలను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ కు బలంగా ఉండే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఓటు బ్యాంకును గుంప గుత్తగా లాగేసుకున్న జగన్ నిలువరించేందుకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేస్తోంది. దీనికి ఆయన చెల్లి వైఎస్ షర్మిల అయితేనే సరిగ్గా ఉంటుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో వైయస్సార్ టిపి పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి పాదయాత్రను చేపట్టిన షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే ప్రతిపాదనకు షర్మిల కూడా పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ దూతలను షర్మిల వద్దకు పంపిన కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు పలు రకాల ప్రతిపాదనలు చేసినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మళ్లీ పునర్జీవం పోసుకోవాలంటే షర్మిల వాళ్ళని సాధ్యం అవుతుంది అని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సిపి విలీనం అవుతుందని సమాచారం. విలీనం తర్వాత వైయస్ షర్మిల పూర్తిస్థాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాక్టివ్ అవుతారని కూడా అర్థమవుతుంది. 2029 ఎన్నికల లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలం పుంజుకోవడానికి వైయస్ షర్మిలను రంగంలోకి దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రత్యేక హోదా నినాదం

కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను విభజించింది అని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో బలంగా కోపం ఉంది. కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడానికి కూడా ఇదే కారణం. అయితే 2014 తర్వాత దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వైపు దృష్టి పెట్టకపోయినా ఆంధ్రప్రదేశ్ పెద్దగా అభివృద్ధి చెందింది ఏమీ లేదు. దీనికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాలేదని, రాష్ట్ర విభజన చట్టంలోని అనేక విషయాలను బిజెపి విస్మరించిందని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా తో పాటు రాష్ట్ర అభివృద్ధికి, విభజన చట్టం అమలకు పటిష్టంగా పనిచేస్తుందని కాంగ్రెస్ నినదించనుంది. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రం ఇవ్వవలసి వచ్చిందని కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని విధాల సహకరిస్తామని తమకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళనుంది. దీనికి బలమైన వర్గానికి చెందిన అందరికీ తెలిసిన వ్యక్తి అయితేనే బాగుంటుందని కోణంలో వైయస్ షర్మిలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. షర్మిల కూడా దీనికి అంగీకారం తెలిపినట్లే సమాచారం. ఇటీవల రాహుల్ గాంధీ మళ్ళీ పార్లమెంట్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా వైయస్ షర్మిల దానికి అనుకూలంగానే స్పందించారు. దీంతోపాటు అన్నయ్య జగన్ తోనూ ఆమెకు పడటం లేదు. వైయస్సార్సీపి కష్టకాలంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన దానికి కనీసం ప్రతిఫలం లేదు అన్న కోపంతో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పూర్తిగా తనను పక్కన పెట్టాడు అన్న అక్కసు కూడా షర్మిల లో ఉంది. వీటన్నింటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ షర్మిల అయితేనే మళ్లీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పుంజుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది అని భావించి ఆమెను రంగంలోకి దింపనట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *