fbpx

ఊసరవెల్లి మాటలు చెప్పేవారు రాజశేఖర్ రెడ్డికి వారసులు అవుతారా ?: షర్మిల

Share the content

తమ స్వప్రయోజనాల కోసం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు రాష్ట్ర భవిష్యత్ ను కేంద్రం వద్ధ తాకట్టు పెట్టారని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు షర్మిళ విమర్శించారు. శనివారం కడపలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఎపిసిసి చీఫ్‌,కడప ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిలా రెడ్డి ప్రసంగించారు.రాష్ట్ర విభజన తరువాత ఒక్క హామీని బిజెపి నెరవేర్చలేదు. 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని బిజెపి వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. విభజన హామీలు వెరవేర్చని బిజెపి తో వైసిపి, టిడిపి లు ఎందుకు పొత్తులు, తొత్తులుగా మారారు ? అని ప్రశ్నించారు. ఐదేళ్లలో జగన్‌ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. సంక్రాంతి కి జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారా ? మద్యపాన నిషేధం చేశారా ? అని ప్రశ్నించారు.

రాజశేఖర్ రెడ్డి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి .. అధికారం లోకి వచ్చాక రిలయన్స్ కు సంబంధించిన దగ్గరి వ్యక్తులకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారని మండిపడ్డారు. తండ్రిని చంపిన వారికి ఇచ్చారని అనుకోవాలా? గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పింది అబద్ధం అని అనుకోలా అని నిలదీశారు.రాజశేఖర్ రెడ్డి పేరును సీబీఐ చార్జీ షీట్ లో కాంగ్రెస్ పార్టీ చేర్పించలేదు.చార్జీ షీట్ లో రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా జగన్మోహన్ రెడ్డి కేసులు నుంచి బయటపడటం అసాధ్యం అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి భావించారాన్నారు. రాజకీయాల కోసం రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్‌ షీట్‌ లో పెట్టించారని ధ్వజమెత్తారు.వివేకా మరణం తర్వాత సిబిఐ విచారణ డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి…ముఖ్యమంత్రి అయిన తరువాత సిబిఐ విచారణ అవసరం లేదని మాట మార్చారన్నారు.ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా ఊసరవెల్లి లా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీరు రాజశేఖర్ రెడ్డికి వారసులు అవుతారా అని ప్రశ్నించారు.

సొంత చిన్నాన్న హత్య గావించబడితే అధికారాన్ని అడ్డంపెట్టి న్యాయం జరగనివ్వలేదు.కడప పార్లమెంట్ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఒక వైపు ఉంది. వివేకానంద రెడ్డిని హత్య చేసినా వారు మరో వైపు ఉన్నారు.ఒక వైపు ధర్మం ఉంది.ఇంకో వైపు అధికారం, డబ్బు ఉంది.కడప ప్రజలు న్యాయం వైపు నిలబడతారా? నేరం వైపు నిలబడతారా? అని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం కడప ఓటరు తీర్పు కోసం ఎదురు చూస్తోందని వివరించారు.జిల్లా ప్రజలు న్యాయం వైపు నిలబడాలని కోరారు.ఎంపి గా గెలిపించండి.మీ గొంతుకును అవుతా.పార్లమెంట్లో కొట్లాడతానని అన్నారు.రాష్ట్రంలో తిరిగి వైఎస్‌ఆర్‌ పాలన తిరిగి తెస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *