fbpx

చెల్లెళ్ళు కంటే భార్య బంధువులు ఎక్కువ అయ్యారా జగనన్న ? : షర్మిల

Share the content

వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని సిబిఐ ధృవీకరించింది. ఫోన్ కాల్ రికార్డ్స్, గూగుల్ టేక్ ఔట్, డబ్బులు చేతులు మారినట్లు సాక్ష్యాలు ఉన్నాయని సిబిఐ చూపిస్తుంది.ఇన్ని సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఇరోజు వరకు కూడా అవినాష్ రెడ్డి ఒక్క వెంట్రుక కూడా సిబిఐ ఎందుకు పికలేకపోయింది? అని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల ధ్వజమెత్తారు.గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందుల లో ఏర్పాటు చేసిన న్యాయ యాత్ర బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో వివేకానంద రెడ్డి నిందితులను జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. కర్నూల్ లో అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయాలని సిబిఐ ప్రయత్నం చేస్తే తన అధికార బలాన్ని ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. చివరకి ఉట్టి చేతులతో సిబిఐ వెనుదిరిగింది..సిబిఐ చరిత్రలో కూడా ఎన్నడూ జరగని అవమానం వారికి చేశారు.వివేకానంద రెడ్డిని హత్య చేస్తే సాక్షిలో హార్ట్ ఎటాక్ ని ఎలా రాశారు? వివేక హత్య ఘటనపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి…ముఖ్యమంత్రి అయిన తరువాత సిబిఐ విచారణ అవసరం లేదని ఎందుకని అన్నారు.హత్య కేసులో కడిగిన ముత్యంలా బయటకి వస్తాము అని నమ్మకం మీకు ఉంటే సిబిఐ విచారణకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటి ? చెల్లెళ్ళు కంటే భార్య బంధువులు ఎక్కువ అయ్యారా అని ప్రశ్నించారు.రాజశేఖర్ రెడ్డి కొడుకు వివేకానంద రెడ్డికి కొడుకు కాదా? నిందితులు పక్షాన మూర్ఖంగా ఎందుకు నిలబడ్డారు?ఐదు సంవత్సరాలుగా నిందితుడ్ని కాపడుతూ అతనికే టిక్కెట్ ఇచ్చారు..
అంతకంటే మగాడు జగన్మోహన్ రెడ్డికి దొరకలేదా అని నిలదీశారు.

ఆడబిడ్డలుకు న్యాయం చేయండి

నలబై ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేసిన నాయకులు వివేకానంద రెడ్డి.ఎప్పుడు ప్రజలతోనే ఉండే నాయకులు. రాముడు, లక్ష్మణుడు ఎలా ఉంటారో రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి అలా ఉండేవారు.అలాంటి వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేశారు.వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత రెడ్డి .. న్యాయం కోసం తట్టని తలుపు లేదు.ఎక్కని కోర్టు మెట్టు లేదు.తిరగని పోలీస్ స్టేషన్ లేదు.ఐదేళ్లుగా న్యాయం కోసం వెతుకుతూనే ఉంది. చివరకి ప్రజా క్షేత్రంలోనే అయినా న్యాయం జరుగుతుందని భావించింది. మీ ముందర రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తెలుగా నిల్చున్నాం. కొంగుచాచి న్యాయం అడుగుతున్నాం అని కోరారు.వివేకానంద రెడ్డి రక్తం ఐదు సంవత్సరాలుగా న్యాయం కోసం ఆక్రోసిస్తూ ఉంది.న్యాయానికి..నేరానికి , ధర్మానికి,అధర్మానికి మధ్య కడప పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *