fbpx

కొత్త పార్టీ గేమ్ ప్లాన్ పై అయోమయం

Share the content

ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన భారత చైతన్య యువజన పార్టీ రాజకీయ పంథా ఏమిటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇటీవల పార్టీని ఆవిర్భవిస్తూ జండా ఎగురవేసిన రామచంద్ర యాదవ్ అప్పుడప్పుడు విలేకరులతో మాట్లాడుతున్నారు తప్పితే రాజకీయంగా ఇంకా వేగం మాత్రం పుంజుకోలేదు. పార్టీ కనుక వేగం పుంజుకుంటే కొత్త వ్యక్తులు రంగ ప్రవేశం చేస్తే ఏమైనా పార్టీలో కదలిక వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకపక్క ఇప్పటికే బీసీల్లో కీలకమైన యాదవ సామాజిక వర్గం నేతలు తమ పార్టీగా చెప్పుకుంటూ పార్టీని ప్రమోట్ చేసే పనులు బిజీగా ఉన్నారు. మరోపక్క ఇతర బీసీ కులాలను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. దీనిలో భాగంగా పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ త్వరలోనే అన్ని బీసీ సంఘాలతో భారీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో బీసీలు ప్రభావితం చేసే స్థానాలను ముందుగా గుర్తించి ఆయా స్థానాల్లో కీలకంగా ఉండే వ్యక్తులను పార్టీ ద్వారా వెలుగులోకి తీసుకురావాలని రామచంద్ర యాదవ్ భావిస్తున్నారు. ఆర్థికంగా బలోపేతం లేకున్నా సరే బీసీ సంఘాల ద్వారా ఆయా నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులైన నేతలతో మాట్లాడి పార్టీలోకి తీసుకువచ్చే చర్యలు రామచంద్ర యాదవ్ త్వరలోనే తీసుకోనున్నారు. కొత్త పార్టీ లక్ష్యాలు, సిద్ధాంతాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించేలా బిసి మార్కులు వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా చూపించేలా ప్రణాళికలు వేస్తున్నారు.

అంతులేని నాయకులు

కొత్త పార్టీ స్థాపనను ఆంధ్రప్రదేశ్ మీడియా అంతగా పట్టించుకున్నది లేదు. పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కొన్ని డిజిటల్ ఛానల్ కు పెయిడ్ ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఇవ్వడం ద్వారా మాత్రమే ఇప్పటికీ మీడియా తో టచ్ లో ఉన్నారు. ప్రధాన మీడియా బోడె రామచంద్ర యాదవ్ పార్టీని పూర్తిగా గుర్తించినట్లుగా కూడా లేదు. పార్టీ ఆవిర్భావానికి సైతం పెద్ద నాయకులు గానీ ఇతరత్రా ప్రముఖులు గానీ ఎవరూ రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో అసలు ఈ పార్టీ నుంచి 175 నియోజకవర్గంలో ఎవరు నిలబడతారు వారికి వెన్ను దన్ను ఎవరు ఇస్తారు అన్న ప్రశ్న అయితే అలాగే కొనసాగుతోంది. పార్టీని నడపడం సాధారణ విషయం కాదు. బడా రాజకీయ నాయకులకు సినీ ప్రముఖులకే పార్టీ నడపడం చేతకాలేదు. ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీని నడపడం బోడె రామచంద్ర యాదవ్ ఎంత మేరకు విజయవంతం అవుతారు కేవలం 2024 ఎన్నికల లక్ష్యంగా ఈ పార్టీని పెట్టారా అన్నది కూడా త్వరలోనే తేలిపోతోంది. కేవలం రామచంద్ర యాదవ్ తన సొంత శక్తిని నమ్ముకుంటే పార్టీని నడపడం కూడా చాలా కష్టతరమే. కీలకమైన నేతలను ఆయన ఏ మేరకు పార్టీలోకి తీసుకువస్తారు ఆయన ఎజెండా ఏమిటి ఎలా ముందుకు వెళ్తారు అన్నది కాలమే నిర్ణయించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *