fbpx

సీఎం ఫోర్జరీ సంతకంతో 225 ఫైల్స్

Share the content

జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర ప్రభుత్వంపై మరొక కీలక వ్యాఖ్య చేశారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ ఆయన మీడియా ముఖంగా తెలిపారు. గుంటూరు జనసేన పార్టీ కార్యాలయంలో కీలక నేతలతో సమావేశమైన నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి తెలియకుండానే 225 ఫైల్స్ మీద డిజిటల్ సంతకాలు సీఎం ఫేషిలో ఫోర్జరీ జరిగాయని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కి తెలియకుండా, ఆయన ప్రమేయం లేకుండా 225 ఫైల్స్ మీద డిజిటల్ సంతకాలు సీఎం పేషీలో ఫోర్జరీ అయ్యాయని అసలు సీఎం పేషీలోకి వచ్చే ఫైల్స్ చాలా కీలకంగా ఉంటాయి. అలాంటి ఫైల్స్ మీద సీఎంకే తెలియకుండా సంతకాలు ఫోర్జరీ చేసింది ఎవరు..? ఫోర్జరీ చేసిన ఫైల్స్ ఏమిటి? రెవెన్యూ శాఖకు సంబంధించిన గనులు శాఖవా? లేక సాగునీటి రంగానివా..? ఇంకా ఇతర ముఖ్య ఫైల్స్ దీనిలో ఉన్నాయా..? అనేది అంతు పట్టకుండా ఉందన్నారు. సీఎం పేషీలో ఇంత పెద్ద తప్పు జరిగినా విషయం బయటకు పోక్కకుండా ఎందుకు అంత రహస్యంగా ఉంచుతున్నారు..? దీని వెనుక ఉన్న శక్తులు.. వ్యక్తులను బయటపెట్టాలి. ఏ ఫైల్స్ విషయంలో తప్పు జరిగిందో వెంటనే సీఎంఓ ప్రజలకు వెల్లడించాలి అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరు వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి అదే స్థాయిలో ఇప్పుడు జనసేన పిఎసి చీఫ్ మనోహర్ ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సంతకాన్ని 225 ఫైల్స్ మీద డిజిటల్ సంతకం ఫోర్జరీ జరిగిందంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వంలో జరుగుతున్న కీలకమైన విషయాలను టార్గెట్ చేస్తూ జనసేన ముందుకు కదులుతుంది. నాదెండ్ల మనోహర్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి ఎప్పటిలా టాపిక్ డైవర్ట్ చేసే విధంగా వ్యక్తిగత విషయాలపై ఎటాక్ చేస్తారో..ఫోర్జరీ సంతకాలు జరగలేదని నిరూపిస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *