fbpx

ముసలాయన?? అనడం నీకో పెద్ద మైనస్ జగన్ జాగ్రత్త!!!

Share the content

జీవితానిభవానికి నా వయసు ఒక ఆభరణమని భావించుకుంటున్నాను. నా పరిసరాల నుంచి నా వయసు వల్ల కూడా వచ్చే గౌరవానికి కృతజ్ఞుడినై వుంటున్నాను. ఎవరినైనా గాని “ముసలోడు”అనే సంబోధనను అసహ్యించుకుంటున్నాను. జగన్ గారి నీచ సంస్కారాన్ని చీత్కరిస్తున్నాను……

పైన ఉన్న స్టేట్మెంట్ ఒక సీనియర్ జర్నలిస్ట్ తాలూకా వేదన. కొన్ని సంవత్సరాలు పాటు జీవితంలో కష్టపడి చరమాంకంలో సైతం ఆత్మగౌరవం అని చంపుకోక పని చేస్తూ పోయిన వారి వేదన ఇలాగే ఉంటుంది….

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలోను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను ఉద్దేశిస్తూ ” ముసలాయన” సంబోధించడం చాలా వర్గాల్లో ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారిలో ఒక రకమైన ఏహ్య భావనను కలిగిస్తోంది. ఇది క్రమంగా ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిత్వం మీద, ఆయన సంస్కారం మీద మాట్లాడుకునే చర్చ దిశగా వెళ్లడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తోంది.

ఆయన పార్టీ వాళ్లు సైతం తప్పు పడుతున్నారు

కాలం అనేది శాశ్వతం కాదు. అలాగే వయసు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనిషి జీవితంలో ప్రతి దశను మనం గౌరవించాలి. రాష్ట్రానికి సుమారు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి కనీసం మర్యాద ఇవ్వకుండా ముసలాయన అంటూ బహిరంగ సభల్లో జగన్ వ్యాఖ్యానించడం అంత పార్టీ నేతల్లోనే భిన్నభిప్రాయాలను తీసుకొస్తోంది. ముఖ్యంగా జగన్ వ్యక్తిత్వం ఎలాంటిది అన్న చేర్చు కూడా ఈ వ్యాఖ్యలు వల్ల జనంలో రేగే అవకాశం ఉంది. పెద్దవారిని జగన్ గౌరవించే అవకాశం లేదు అని ఆయన వ్యాఖ్యల వల్లే తెలుస్తుంది అని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఇది సొంత పార్టీ నేతల్లోనూ జగన్ ఇమేజ్ నూ డామేజ్ చేసే మాటగా నిలిచిపోనుంది. ముఖ్యంగా న్యూట్రల్ ఓటర్లు జగన్ మాటలను అసహ్యించుకునే పరిస్థితి వచ్చింది.

ఇది దెబ్బే

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో మాట్లాడే స్క్రిప్టు ఏ మాత్రం మార్పులు చేర్పులు చేయకుండానే దాదాపు ఇస్తున్నారు. ప్రతి సభలోను ఒకటే మాట అన్నట్లుగా సభలు సాగిపోతున్నఈ తప్పితే ఏమాత్రం జనరంజకంగా లేవు. కార్యకర్తలకు బూస్ట్ అప్ ఇచ్చేలా ఆయన సభలు ఎక్కడ సాగడం లేదు. సాదాసీదాగా మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు తప్పితే పార్టీకి కూడా ఏ మాత్రం బలం లేనివిధంగా జగన్ ప్రసంగం తయారయింది. దీనికి తోడు ఈ మధ్యలో చంద్రబాబును ముసలాయన అంటూ సంబోధించడం ఆ పార్టీకి పెద్ద మైనస్ కానుంది. ఇది ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన ఓటర్లలో తీవ్ర ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ తన ప్రసంగశైలి మార్చుకోకపోతే వైసీపీకి కచ్చితంగా పెద్ద దెబ్బగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *