fbpx

తోడేళ్ళ సైన్యం నాతో యుద్ధం చేయటానికి వస్తున్నారు….ఈ జగన్ కు మద్దతుగా మీరు సిద్దమా ?

Share the content

రామాయణం… మహా భారతం లో విలన్ల వలే నేడు.. ఈనాడు,టివి 5, చంద్రబాబు, దత్త పుత్రుడు, పక్క పార్టీలో ఉన్న చంద్రబాబు కోవర్ట్లు అందరూ..తోడేళ్ళ రూపేణా మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకొని సిద్దంగా ఉన్నారు. వారితో పోరాడటానికి నాకు మద్ధతుగా మీరు అంత సిద్దమా? సిద్దమా? అని వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను ప్రశ్నించారు. శనివారం దెందులూరులో వైసిపి ఎన్నికల శంఖారావం ” సిద్ధం” సభలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….దుష్ట చతుష్టయం కు చూడటానికి జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు..కానీ నిజం ఏమిటో తెలుసా…జగన్ ఏనాడు కూడా ఒంటరి కాదు…దుష్ట చతుష్టయం కి ఉన్న సైన్యం పొత్తులు…యెల్లో పత్రికలు అయితే….నాకు ఉన్న తోడు ….నా ధైర్యం.. నా బలం, పైన ఉన్న ఆ దేవుడు… ఈ రాష్ట్ర ప్రజలు అని పేర్కొన్నారు.

ఇది ఒక నాయకుడు మీద నమ్మకం నుంచి పుట్టి వచ్చిన సైన్యం…ఒక నాయకుడ్ని ప్రజలు నమ్మారు అంటే ఏ రకంగా స్పందన ఉంటుంది అంటే దానికి సాక్ష్యమే ఈ సభ అని పేర్కొన్నారు. 57 నెలల పాలనను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు.. వైసిపిని మరో సారి గెలిపించేందుకు మీరు అందరూ సిద్ధమేనా అని ప్రశ్నించారు.పేదలను కాటేసే యెల్లో వైరస్ మీద కనిపిస్తున్న ఆ కరోన లాంటి దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి ఒక మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన అక్క చెల్లెమ్మలు, నా సోదరులు ,నా స్నేహితులు..మీరు అంతా కూడా సిద్ధమేనా? రానున్న ఎన్నికల రణక్షేత్రం లో కృషుడు పాత్ర పోషిస్తున్నది రాష్ట్ర ప్రజలు ఐతే …అర్జునుడు మీ జగన్మోహన్ రెడ్డి…. ప్రభుత్వం చేసిన మంచినే మన అస్త్రా లుగా కౌరవ సైన్యం మీద యుద్ధం చేయటానికి మీరు అంతా సిద్దమా? సిద్దమా? అని ప్రశ్నించారు. ..దుష్ట చతుష్టయం చేస్తున్న దాడి… మన సంక్షేమం మీద…ప్రతి ఇంటికి వైసిపి చేసిన అభివృద్ధి మీద…పేదవాడి సంక్షేమం మీద.. దాడి అని మండిపడ్డారు.

గోదారమ్మ సాక్షిగా ఒక్కటి చెప్పదలుచుకున్నా…..

ఈ గోదారమ్మ సీమలో నించుని ఒక్కటి చెప్పదలుచుకున్నా… ఈ ఐదేళ్లలో ప్రతి ఇంటింటా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గ్రామ గ్రామంలో నూతనంగా తీసుకువచ్చిన మార్పు..ప్రతి గ్రామంలో లంచాలు లేకుండా …వివక్షకు తావు లేకుండా తెచ్చిన సచివాలయ వ్యవస్థ. చరిత్రలో ఎక్కడ కూడా ..ఎప్పుడూ కూడా చూడని సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్…మన వైయస్సార్ పార్టీ.. మీ జగన్ మాత్రమే అని చెప్పదలుచుకున్నా.. ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసి చెప్పటానికి కావాల్సిన అన్ని అంశాలను మీతో పంచుకొనేందుకు తిరుగులేని ఆత్మ విశ్వాసంతో 175 కు 175 ఎమ్మెల్యే లను 25 కు 25 ఎంపిలను గెలవవలసిన అవసరాన్ని వివరించేందుకు ..మీ అందరితో..నా మనసును పంచుకునేందుకు ఇక్కడకి వచ్చాను అని తెలిపారు.

జగన్ పాలనకు…….చంద్రబాబు పాలనకు తేడా వివరించండి..
ప్రతి జగన్ అభిమాని…ప్రతి వైసిపి కార్యకర్త….ప్రతి ఇంటికి వెళ్ళి …ప్రతి అమ్మా అక్కా..చెల్లమ్మ లను అడగండి. 1995 లో సిఎం చంద్రబాబు … మీ ఇంటికి కానీ మి ఊరికి కానీ …మి కుటుంబ భవిష్యత్ కు కానీ ఏం చేశారని అడగండి. ప్రతి పేద కుటుంబాన్ని అడగండి…గత పదేళ్లుగా వారి బ్యాంక్ అకౌంట్ వివరాలను వారినే చూడమని అడగండి…చంద్రబాబు పాలనలో బ్యాంక్ అకౌంట్ వివరాలు… మి బిడ్డ జగన్ ఐదేళ్ల పాలనలో బ్యాంక్ అకౌంట్ లో ఎంత డబ్బులు పడ్డాయి అని వారినే చూడమని చెప్పండి అని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రభుత్వ పాలనలో ఆ పేద కుటుంబానికి వారి బ్యాంక్ అకౌంట్ కి ఇచ్చింది ఎంత అని అడగండి…ఏనాడైనా కూడా ఒక్క రూపాయి అయిన కూడా వేసాడా అని అడగండి.1994,1999, 2014 లో టిడిపి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను 10 శాతం అయిన అమలు చేశారా అని ప్రతి ఇంటికి వెళ్ళి అడగండి అని తెలిపారు.

మన వైయస్సార్ పార్టీ….మీ జగన్ మాత్రమే

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి గ్రామంలో సచివాలయం ఏర్పాటు చేశాం.. గ్రామ సచివాలయాల ద్వారా 500 రకాల సేవలు అందిస్తున్నాం.. ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు ఇస్తున్నాం.. పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చింది వైసీపీయే.. మనం అధికారంలోకి వచ్చాక 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.. అందరికీ వైద్యం అందాలని ప్రతి గ్రామంలోనూ విలేజ్‌ క్లీనిక్‌ పెట్టాం.. ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చాం అని తెలిపారు. లంచాలు, వివక్షకు మారు పేరు అయిన జన్మభూమి కమిటీ రోజుల నుంచి…. ఈరోజు వరకు ఏ గ్రామంలో కూడా లంచాలు లేకుండా….వివక్ష లేకుండా సచివాలయం వ్యవస్థ ఎవరు తెచ్చారు అంటే మన వైయస్ఆర్ పార్టీ …మీ జగన్ అని చెప్పండి అని అన్నారు.డిబిటి ద్వారా బటన్ నొక్కి నేరుగా డబ్బులు పంపుతుంది ఎవరు అంటే మీ జగన్..మన వైయస్ఆర్ సిపి ప్రభుత్వం అని వివరించండి అని పేర్కొన్నారు.

మంత్రివర్గంలో 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీ,నా ఎస్టీ ,నా బిసి అని పిలుచుకునే వారికే దక్కింది అంటే అది కేవలం వైసిపి పాలనలో మాత్రమే అని తెలిపారు. నాలుగు డిప్యూటీ సిఎం పదవులు. స్పీకర్…డిప్యూటీ స్పీకర్.మండలి చైర్మన్..పదవులు సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా ఉంది ఎప్పుడు అంటే….అది వైసిపి పాలనలో అని గర్వంగా చెప్పగలను అని పేర్కొన్నారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడక ముందు నాలుగు లక్షలు ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే… వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత 2,13,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు.ఇందులో 80 శాతం ఉద్యోగాలు నా అని పిలిచుకునే వారికే ఇచ్చామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *