fbpx

దుష్ట చతుష్టయం ఆడే పద్మ వ్యూహాల్లో చిక్కుకోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు….అర్జునుడు : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్రంలో మరో 73 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్ర యుద్ధం జరగనున్నది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఒక వైపు… కౌరవ సైన్యంతో దుష్ట చతుష్టయం మరో వైపు ఉన్నది. కౌరవ సైన్యం వేసే వ్యూహాల్లో కుట్రలు,కుతంత్రాలు, వెన్నుపోట్లు,పొత్తులు, ఎత్తులు,జిత్తులు కనిపిస్తున్నాయి …కానీ పద్మ వ్యూహాలకు చిక్కుకొని బలైపోవడనికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు…అర్జునుడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. శనివారం విశాఖపట్నంలో భీమిలి నియోజకవర్గం లో అధికార వైసిపి ఎన్నికల శంఖారావం గా భావిస్తున్న “సిద్ధం” సభలో ఆయన మాట్లాడుతూ… ఈ యుద్ధంలో పోరాడటానికి గడిచిన 56 నెలల్లో పేద ప్రజలకు అమలు చేసిన పథకాలే మనకు అస్త్రాలు భాణాలుగా ఉన్నాయని వెల్లడించారు. ఈ అర్జునుడు కి తోడుగా దేవుడు దయ, అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మల అండదండలు ఉన్నాయి కాబట్టే మీ బిడ్డ బయపడడు అని పేర్కొన్నారు.

ఈ యుద్ధంలో 175 స్థానాలకు కు 175 వైసిపి లక్ష్యం… ఈ యుద్ధంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా దేవుడి దయతో మనం ప్రతి ఇంటికి,ప్రతి ప్రాంతానికీ చేసిన మంచి వల్ల చంద్రబాబు తో సహా అంతా కూడా ఓడాల్సిందే అని గర్వంగా చెప్పగలనని ధీమా వ్యక్తం చేశారు. .2024 ఎన్నికల కు మన పార్టీ జైత్ర యాత్రకు మరో పాతికేళ్లపాటు మన సంక్షేమ అభివృద్ధి పాలన కొనసాగింపు కు భీమిలి పట్నం వేదికగా ఉంటుంది. ఈ సమావేశం మన పార్టీని భుజాన మొస్తున్న కార్యకర్తలు కు అభిమానులను కు ఆత్మీయులకు మరింత ఆత్మ విశ్వాసం నింపే సమావేశం భీమిలి పట్టణం చరిత్ర లో నిలిచిపోతుంది అని పేర్కొన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో…ఆ మేనిఫెస్టో లో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ…ఆ మేనిఫెస్టో ను ఒక బైబిల్ గా, భగవధ్గిత ,ఖురాన్ గా భావించి ఏకంగా 99 శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా మితో నా ఆలోచనలును పంచుకునేందుకే ఈ సభ ఉద్దేశం అని పేర్కొన్నారు.

పెత్తందారీలకు పల్లెలు అంటే చిన్నచూపు

75 ఏళ్లు వయసు మళ్లీనా నాయకుడు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక …దత్తపుత్రుడుతో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. 2014_2019 మధ్య చంద్రబాబు కు ఫలానా మంచి పని చేశానని అనిగాని చెప్పలేక..మళ్ళీ కొత్త వాగ్దానాలతో గారడీ చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వాళ్ళు లేరని చివరకి 2019 లో వచ్చిన 23 స్థానాలు కూడా ఆ పార్టీకి వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు.టిడిపి కి 175 స్థానాల్లో కనీసం పోటీ పెట్టేందుకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. వైసిపి పార్టీ చరిత్ర ఓ విప్లవ గాథ ..వైసిపి చరిత్ర ఇంటింటి విజయ గాథ..మన భవిష్యత్ సామాజిక వర్గాల ఇంద్రధనుస్సు ఉన్న పార్టీ వైయస్సార్ పార్టీ అని పేర్కొన్నారు.

పేదరికం ,అసమానత సంకెల్లను బద్ధలు కొట్టి ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ..21 వ శతాబ్దం లోకి ఆ పేదలందరని నడిపిస్తున్న మనసున్న భాధ్యత కల ప్రభుత్వం వైసిపి ప్రభుత్వం అని తెలిపారు. కరెప్షన్ లేకుండా..వివక్ష లేకుండా ప్రతి పేదవాడి చెయ్యి పట్టుకొని నడిపించాలనే ఆలోచన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు కు మనసుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పెత్తందారీ కాబట్టి ఆయనకు ఇలా పరిపాలన చేయాలని తెలియదు.పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పొలాల్లో పని చేసే ప్రజలు తమ పొట్ట కోసం ఉండే జనావాసం..ఆ పల్లె అని ఆయన నమ్మకం. పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి…గొప్పగా భవిష్యత్తు మారాలి ఆన్న తపన, తాపత్రయం పెత్తందారులుకు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరో 70 రోజుల్లోనే ఎన్నికలు….. అబద్ధానికి… నిజానికి యుద్ధం జరుగుతుంది..మోసానికి విశ్వసనీయతకు మధ్య యుద్ధం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో టిడిపి మేనిఫెస్టోలో 650 వాగ్ధానాలు ఇచ్చారు. అందులో 10 శాతం హామీలను కూడా చంద్రబాబు అమలు చేయలేదని మండిపడ్డారు. మరో పక్క వైసిపి పార్టీ ఇచ్చిన వాగ్దానాలలో 99 శాతం అమలు చేసి ప్రతి ఇంట్లోనూ కొత్త సంతోషాన్ని చూపించిన వైసిపి ప్రభుత్వం మరో పక్కన ఉందని అందరికీ తెలియచేయండి అని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *