fbpx

పవన్ ను బోల్తా కొట్టించిన జగన్

Share the content

పవన్ కళ్యాణ్ ను జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బోల్తా కొట్టించాడు. ముందస్తు ఎన్నికల విషయంలో పవన్ కు వచ్చిన సమాచారం విషయంలో జగన్ చేసిన ట్రిక్ కు పవన్ బుక్ అయ్యాడు. ముఖ్యంగా ఎన్నికలకు ముందస్తుగా వెళ్తున్నామంటూ పదేపదే ఢిల్లీ పెద్దల దగ్గర జగన్ చెప్పడం దానిని ఢిల్లీ నుంచి కొందరు పవన్ సన్నిహితులు ఆయనకు చేరవేయడంతో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తెలంగాణతో పాటు జరుగుతాయని పవన్ భావించారు. దీంతోనే ఆయన వారాహి యాత్రను జూలై నుంచి ప్రారంభించారు. ఎన్నికలకు సమయం సరిపోదు గనుక కచ్చితంగా డిసెంబర్లో ఎన్నికలు వస్తే కనుక దానిని ఎదుర్కొనేందుకు, శ్రేణులను సమయత్వం చేసేందుకు వారిలో కొత్త నింపేందుకు వారాహిని సిద్ధం చేసి రోడ్ల పైకి వచ్చారు.

పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రాలో ముందస్తు ఎన్నికలు ఉంటాయి అనేలా మాట్లాడారు. జగన్ పలుమార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు దీనిపై చర్చించడమే ప్రధాన కారణం. అయితే జగన్ చెప్పిన కొన్ని విషయాలకు కేంద్రం నుంచి సరైన అనుమతి రాకపోవడంతోనే ముందస్తు ఎన్నికలపై జగన్ వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. పనిలో పనిగా ముందస్తుకు వెళ్తాను అని పవన్ కి చెప్పడం ఆయన ప్రచారంలో దిగిపోవడంతో… అసలైన ఎన్నికల జోష్ వారాహి యాత్ర సాక్షిగా తగ్గినట్లే కనిపిస్తోంది. సరిగ్గా ఈ సమయంలో కనుక వారాహి యాత్ర మొదలు అయి ఉంటే కచ్చితంగా మార్చినాటికి అది పీక్ స్టేజ్ లోకి వెళ్ళేది. అయితే జగన్ ఢిల్లీ పెద్దల వద్ద పదే పదే ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించడం అలాగే రాష్ట్ర ఎన్నికల్లో పూర్తిగా సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకొని ఎన్నికలకు వెళ్లాలి అన్న జగన్ ప్రతిపాదనకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా నో చెప్పడంతోనే జగన్ ముందస్తు ఎన్నికలకు వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఉద్యోగులు పూర్తిస్థాయిలో జగన్ను వ్యతిరేకిస్తున్న తరుణంలో సాధారణ ఎన్నికలకు వారిని ఉపయోగిస్తే తనకు చాలా ప్రమాదమని జగన్ భావిస్తున్నారు. దీంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయిలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని ఉపయోగించుకొని ఎన్నికలకు వెళ్లాలని భావించారు. ఇదే ప్రతిపాదనను కేంద్ర పెద్దల వద్ద అలాగే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ప్రస్తావించినప్పుడు అక్కడి నుంచి దానికి తిరస్కరణ ఎదురైనట్టు తెలుస్తోంది. దీంతోపాటు పదేపదే జగన్ ఢిల్లీకి వెళ్లినప్పుడు ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించడంతో పవన్ కళ్యాణ్ కు అక్కడ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆయన ఎన్నికల ప్రచారంలోకి ముందుగానే దిగిపోయారు. ఇప్పుడు వారాహి యాత్రకు మొదట్లో అనుకున్నంతగా స్పందన తర్వాత కనిపించకపోవడానికి ప్రధాన కారణం ఇదే. పవన్ సరైన సమయంలో కనుక ఎన్నికల ప్రచారం వారాహిని లో మొదలుపెట్టి కనుక ఉంటే.. ఆ క్రేజ్ వేరే స్థాయిలో ఉండేది. అయితే ఈ విషయంలో జగన్ విహాత్మకంగానే పవన్ ని దెబ్బ కొట్టినట్లు తెలుస్తోంది. ముందస్తు సంకేతాలు ఇచ్చి తర్వాత వెనక్కు తగ్గడం ద్వారా జగన్ పవన్ మీద పై చేయి సాధించారు. కచ్చితంగా ఎన్నికల విహంలో ప్రధానమైన ప్రచార ఆస్త్రాన్ని ముందుగానే పవన్ వాడుకోవడంతో ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఏం చేయనున్నారు అన్నది కీలకం కానుంది. తెలంగాణ ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆంధ్రాలో ఎన్నికల సందడి మొదలు అవుతుంది. చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ మీద కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో… తెలంగాణ ఎన్నికల అనంతరం ఆంధ్రాలో పూర్తిస్థాయి హడావుడి నెలకొనే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *