fbpx

పెత్తందారీల విధానాలకు రూపం మార్చుకున్న అంటరానితనం : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు పూర్తి అయిన కూడా అంటరానితనం అంతం కాలేదని .. పెత్తందారులు విధానాలకు దాని రూపాన్ని మాత్రమే మార్చుకున్నదని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు . శుక్రవారం విజయవాడ లో సామాజిక సమత సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ… స్తాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఇప్పటివరకు అమెరికా అని మాత్రమే మనం విన్నాము..ఇక నుంచి స్తాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే ఇండియా లో విజయవాడ పేరు మారు మ్రోగుతోందని పేర్కొన్నారు.పెత్తందారీతనం, కుల అహంకారం, వ్యవస్థల దుర్మార్ఘాల, అక్క చెల్లెమ్మల పై జరిగే వివక్షల మీద పోరాటాలకు అంబేద్కర్ స్ఫూర్తి అని తెలిపారు.

56 నెలలుగా అంటరానితనం మీద మనం చేస్తున్న సామాజిక ,ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా అంబేద్కర్ శిల్పం ఎప్పటికీ గుర్తు ఉంటుందని పేర్కొన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆకాశమంత వ్యక్తిత్వమని, విద్యార్థులు ఆయన జీవిత చరిత్ర నుంచి నుంచి స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. అభివృద్ధికి, అభ్యదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ బవజాలమని పేర్కొన్నారు. నేటి సమాజంలో ఇలాంటి భావజాలం పెత్తందారులుకు నచ్చదు అని విమర్శించారు. గత ప్రభుత్వంలో దళితులకు చంద్రబాబు ఇళ్ల నిర్మాణాలుకు సెంటు భూమి ఇచ్చింది లేదు..అంబేద్కర్ శిల్పం నిర్మించింది అంతకన్నా లేదని మండిపడ్డారు.పేదలు ఏ ప్రభుత్వ బడిలో చదువుకుంటున్నారో.. ఆ ప్రభుత్వ బడిని పాడుపెట్టడం కూడా అంటరానితనమని పేర్కొన్నారు.పేద పిల్లలు తెలుగు మీడియం లోనే చదవాలని వారు ఆంగ్ల మీడియం నేర్చుకోకుడదని బరితెగించి వాదించటం కూడా.. రూపం మార్చుకున్న అంటరానితనమని తెలిపారు.

అంబేద్కర్ ఆలోచనలపై ఈనాడు విష రాతలు

తెలుగు మీడియంలో మాత్రమే పాఠాలు నేర్చుకోవాలని అంబేద్కర్ చెప్పారని పెత్తందారీ ఈనాడు పత్రిక యాజమాన్యం అబద్ధాలు చెబుతూ.. విషం కక్కుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలకు ఒక్క నిజం చెప్పకూడదు అబద్ధాలు మాత్రమే చెప్తుంటే గుండెకు ఎంతో బాధ వేస్తుందన్నారు. వాస్తవం ఏమిటంటే అసలు అంబేద్కర్ చదువుకున్నది ఇంగ్లీష్ మీడియం లో అని వెల్లడించారు. అంబేద్కర్ 4 వ తరగతి పాస్ అయినప్పుడు ఆయన బందువులు పండగ చేసుకున్నారనీ గుర్తు చేశారు. కానీ పత్రిక ముసుగులో తాము పాటించే అంటరానితనాన్ని అబద్ధాలతో అందమైన మేకప్ వేయాలనుకున్న దుర్మార్గులు,నీచులు మన దళితులకు బహుజనులుకు వ్యతిరేకులనీ వెల్లడించారు. చివరకి చరిత్రను కూడా ఇలాంటి వాళ్ళు వ్యతిరేకిస్తూ రాస్తున్నారు అంటే పాత్రికేయ వృత్తి ఎంతకు దిగజారిపోయిందని ఆలోచన చేయండి ఆని పేర్కొన్నారు.

పేద కులాలు వారు ఎప్పటికీ కూడా పెత్తందారులు పొలాల్లో పని వారిగా ఉండాలంట..పేద కులాలు వారు ఏ బస్ లో ఐతే ఎక్కుతున్నారు ..ఆ ఆర్టీసి బస్సులను ప్రైవేట్ సంస్థలకు అమ్ముకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమని పేర్కొన్నారు. ఏ పథకం పేద వారికి అందించల్నన కూడా.. పేదలు లంచాలు ఇచ్చుకుంటూ, కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ..జన్మభూమి కమిటీలు చుట్టూ తిరుగుతూ వారి సహనాన్ని పరీక్షించిడం,వివక్షకు గురి అవ్వడం కూడా రూపం మార్చుకున్న అంటారని తనమేనని తెలిపారు..ఇలాంటి సంఘటనలుతో పాలకులు గుండె కరగకపోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే అని పేర్కొన్నారు.

  • రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
    రాజధాని అమరావతిలో ఎస్సీల అసైన్డ్ భూములను కాజేసి,పెత్తందారులు గజాల లెక్కన అమ్ముకోవాలనుకున్నారని విమర్శించారు.రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ.. పేద సామాజిక వర్గ ప్రజలకు చోటు లేకుండా తాము మాత్రమే ఒక కోట కట్టుకోవడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమేనని పేర్కొన్నారు.పేదల ఇళ్ల నిర్మాణానికి భూములు ఇస్తే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందనీ ….ఏకంగా కోర్టులకు వెళ్లి వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనం అని పేర్కొన్నారు. ఎస్సీలు,ఎస్టీలు,బిసి,మైనార్టీల చదువుకునే ప్రభుత్వ బడుల్లో కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేయడం రూపం మార్చుకున్న అంగరానితనమే అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *