fbpx

అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

రాష్ట్రంలో 55 నెలల వైసిపి ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడ ఎటువంటి లంచాలు లేకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం కాకినాడలో ఆర్ఎమ్సి గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన “వైయస్సార్ ఫించన్ కానుక” కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం కంటే భిన్నంగా,మెరుగ్గా 66,34,000 మందికి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు.ఒక్క పెన్షన్ లకే 1,47,000 కోట్లు ఖర్చు చేశామని పేర్కొన్నారు. గత చంద్రబాబు పాలనలో ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు కేవలం రూ.1,000 లను మాత్రమే ఇచ్చారని,ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో పెన్షన్లు రూ.2,000 చేశారని విమర్శించారు. టిడిపి ప్రభుత్వంలో ఫించన్ పొందాలి అంటే జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చే పరిస్థితి ఉన్నదనీ,నేడు ఏ పథకం అయిన డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ప్రతి మహిళా బ్యాంక్ ఖాతాలుకు పంపిస్తున్నమని పేర్కొన్నారు.

ఐదేళ్ల పరిపాలనలో చంద్రబాబు ఒక్కసారి అయినా బటన్ నొక్కి ప్రజల ఖాతాలకు డబ్బులు చెల్లించారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం 55 నెలల పరిపాలనలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు 2,46,000 కోట్లను డి.బి.టి విధానంలో పంపిణీ చేసిందని పేర్కొన్నారు. గతంలో అమ్మఒడి, జగనన్న చేయూత, జగనన్న చేదోడు, పథకాలు లేవని వెల్లడించారు. ఈ ప్రభుత్వంలో రైతు భరోసా ద్వారా ఐదేళ్ల కాలంలో 53,52,000 మంది రైతులకు 33,300 కోట్ల రూపాయలును చెల్లించామని పేర్కొన్నారు. వైయస్సార్ చేయూత ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ప్రతి మహిళకు 75,000 రూపాయలను చెల్లిస్తూ ఐదేళ్లలో 14,129 కోట్లను విడుదల చేశామని తెలిపారు. వైయస్సార్ కాపు నేస్తం ద్వారా 2,028 కోట్లు,నేతన్న నేస్తం ద్వార 982 కోట్లు,వాహన మిత్ర కింద 1302 కోట్లను,బిసి నేస్తం 1,257 కోట్లను పంపిణీ చేశామని పేర్కొన్నారు. గతంలో ఒక్క ఇండ్ల పట్టా కూడా చంద్రబాబు ఇవ్వలేదని, ప్రస్తుతం 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఇండ్ల పట్టాల పంపిణీ నీ ఆపేందుకు పవన్ కళ్యాణ్ కోర్ట్ కు వెళ్తున్నారని విమర్శించారు.గత ప్రభుత్వానికి,ప్రస్తుత ప్రభుత్వానికి పరిపాలనలో తేడా గమనించండి అని పేర్కొన్నారు.

  • కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే రోజులు రాబోతున్నాయి.
    రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలు ఎక్కువ అబద్ధాలు చెబుతాయని, కేజి బంగారం,బెంజ్ కార్ ఇస్తామని, ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి పొత్తుల రాజకీయం చూడబోతున్నాం అని పేర్కొన్నారు. కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే రాజకీయాలు ప్రతిపక్షాలు చేయబోతున్నాయని విమర్శించారు. మంచి చేయడం ,పేద వారికి అండగా నిలబడటం మాత్రమే తనకు తెలుసని పేర్కొన్నారు. పొత్తులు,ఎత్తులు,జిత్తులు,కుయుక్తులను తాను నమ్ముకొలేదని,ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *