fbpx

నిర్ణీత గడువులో ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ పూర్తి : సిఎం జగన్మోహన్ రెడ్డి

Share the content

ఆరోగ్య శ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు. శుక్రవారం సిఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…ఆరోగ్య శ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ప్రగతిని అధికారులను అడిగి సిఎం తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ ఎటువంటి సందేహాలు ఉండకూడదని సూచించారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి.. అవేర్‌నెస్‌ అనేది పెంచాలని పేర్కొన్నారు.

జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలని సూచించారు. ప్రివెంటివ్‌ కేర్‌ అనేది ముఖ్యమని , ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.ప్రతి ఆరునెలలకోసారి ఇదే విధంగా జరగాలని తెలిపారు. ప్రతి గ్రామంలో షుగరు, బిపి తో బాధపడేవారికి అందే వైద్య సేవలుపై డేటా మ్యాపింగ్‌ జరగాలని ఆదేశించారు.ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్‌ చేయాలని పేర్కొన్నారు.

వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్‌ఎన్‌సీయూలు, 5 ఎన్‌ఐసీయూలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని అధికారుల వెల్లడించారు. విశాఖలో మెంటల్‌ కేర్‌ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్‌ సెంటర్స్, రీజనల్‌ డ్రగ్‌ స్టోర్స్, తిరుపతి ఎస్‌వి మెడికల్‌ కాలేజ్‌లో పీజీ మెన్స్‌ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బర్న్స్‌ వార్డ్, కర్నూలులో స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్సిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్‌ హాల్‌ ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయన్న అధికారులు సిఎం కు వివరించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ స్పెషల్ సీఎస్‌ ఎం టీ కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల హోసమణి, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జి నివాస్‌, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ డి కె బాలాజీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *