fbpx

సేనలోకి సీకే బాబు!!

Share the content

చిత్తూరు జిల్లాలో మాస్ లీడర్ గా జయ చంద్ర రెడ్డికి మంచి పేరు ఉంది. ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సైతం చివరిసారి సీకే బాబు దగ్గరికి వస్తూనే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని వెళ్లాలని ఉద్దేశంతో వస్తూనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. సీకే బాబు చిత్తూరు జిల్లాలోని సుమారు నాలుగు ఐదు నియోజకవర్గాలను ప్రభావితం చేయగల నేతగా గతంలో పేరు ఉండేది. ఆయన అనుచరగణం అంతా అధికంగా ఉండేది. అయితే గత కొంతకాలంగా చాలా స్తబ్దుగా ఉంటున్న సికే బాబు వచ్చే ఎన్నికల్లో ఓ కీలకమైన రాజకీయ స్టప్ తీసుకుంటారు అన్నది ఇప్పుడు కీలకమైన అంశం. ప్రస్తుతం సీకే బాబు భార్య బీజేపీలో కొనసాగిస్తున్నారు. కొంతకాలం యాక్టివ్ రాజకీయాలు చేసినప్పటికీ తర్వాత పూర్తిగా బీజేపీకి దూరమయ్యారు. దీంతో పూర్తిగా సీకే బాబు రాజకీయ భవితవ్యం అంధకారంలో పడింది. అయితే తాజాగా సీకే బాబు జనసేన పార్టీలోకి వస్తారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే కచ్చితంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బలిజల ఓట్లు ఎక్కువ. తర్వాత రెడ్డి ఓటర్లు ఇక్కడ ఎక్కువే. దీంతో ఈ రెండు మీకరణానికి కుదిరితే అక్కడ చాలా సులభంగానే పీకే బాబు నెగవచ్చు అని అంచనాలు ఉన్నాయి.

ముహూర్తం ఎప్పుడు??

సీకే బాబు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు. రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం ఆయన రాజకీయంగా వైసీపీలో చేరుతారు అని అంతా భావించారు. అయితే సీకే బాబు మాత్రం గుమ్మనంగా ఉండిపోయారు. ముఖ్యంగా జగన్ వైఖరి దగ్గర్నుంచి చూసిన వ్యక్తిగా సీకే బాబు వైసీపీలోకి వెళ్లలేదు అని అనుచరుగణం చెబుతుంటారు. దీంతోపాటు రాజకీయంగాను ఆయన ప్రచారంలో లేరు. కొంతకాలం పాటు ఆయన భార్య బిజెపిలోకి వెళ్లినప్పటికీ, పెద్దగా కార్యక్రమాలు చేసింది లేదు. కేవలం రాజకీయ స్టెప్ కు మాత్రమే దానిని వినియోగించుకున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం సీకే బాబు జనసేన నుంచి పోటీ చేయాలని బలంగా భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి సీకే బాబు కు ఉన్న పరిచయాలు ఆధారంగా నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. వారాహి యాత్ర ప్రారంభం సందర్భంగా ఆయన పార్టీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కచ్చితంగా రాయలసీమ జిల్లాలో సీకే బాబు వస్తే సుమారు మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు ప్రభావితం చేయగల శక్తి ఉండటంతో జనసేన నుంచి కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో కచ్చితంగా రాయలసీమలో ఎలకమైన జిల్లాగా ఉన్న చిత్తూరులో రాజకీయంగా కొన్ని మార్పులు చేర్పులు కనిపించే అవకాశం కూడా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *