fbpx

దేశంలో సమస్యలను మరచి …రాముడు వెనుక దాక్కున్న మోడి : సిఐటియు

Share the content

నిరుద్యోగం, అధిక ధరలు, రైతాంగ సంక్షోభం, కార్మికుల కనీస డిమాండ్లు పరిష్కరించలేక మోడీ ప్రభుత్వం రాముడి వెనకాల దాక్కొనదని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు తిరుమల శెట్టి నాగేశ్వరావు ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.వెంకటేశ్వర్లు, కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లూరి రాజబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి 2024 ఎన్నికల్లో బుద్దిచెప్పాలని వారు పిలుపునిచ్చారు. శనివారం కాకినాడ లో ఆల్ ఇండియా కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రైతు సంఘాలు, కార్మిక సంఘాలు భానుగుడి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…దేశ వ్యాప్తంగా అధిక ధరలతో సామాన్యులు పేదరికంలో వెనక్కి నెట్టబడుతుంటే, మోడీ మిత్రులు అయిన అదాని, అంబానీలు మాత్రం ప్రపంచ కుబేరుల స్థానానికి పోటీ పడుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర హక్కులు కాలరాస్తుంటే ….కేంద్రానికి భజన

విశాఖ ఉక్కును ప్రేవేటికరిస్తున్నా, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లించే బాధ్యత నుండి మోడీ ప్రభుత్వం తప్పుకున్నా.. అధికార వైసీపీ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్లలో ఒక్క మాట మాట్లాడకుండా మోడీ భజన చేస్తూ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి రోజు వేతనం 600 చెల్లించాలన్నారు.కౌలు రైతులకు భూ యజమానితో సంబంధం లేకుండా పంట రుణాలు,గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అధిక ధరలు తగ్గించాలని తెలిపారు. ఫిబ్రవరి 16 దేశవ్యాప్త గ్రామీణ బంద్ లో స్వచ్చందంగా రైతులు, కార్మికులందరూ పాల్గొని మోడీ రైతు,కార్మిక వ్యతిరేక విధానాలను ఓడించాలని పిలుపునిచ్చారు.

ఆక్స్ ఫార్మ్ నివేదిక ప్రకారం జిఎస్టీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో అట్టడుగు వర్గాల నుండి 64శాతంతో 15లక్షల కోట్లు ముక్కుపిండి వసూలు చేస్తుంటే… 10శాతంగా ఉన్న ధనవంతులైన కార్పొరేట్ల నుండి 3శాతం మాత్రమే జిఎస్టీ వసులుచేస్తు కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న 18 లక్షల పోస్టులను భర్తీ లేకుండా యువతకు ఉపాధి లేకుండా చేస్తున్నారన్నారు. ఈ పదేళ్ల కాలంలో 1లక్షా 50వేల మంది రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం రైతాంగం సంవత్సర కాలం పాటు చేసిన పోరాటం సందర్భంగా… రైతుల డిమాండ్లన్నీ అమలు చేస్తామని.. పంటలకు మద్దతు ధర చట్టం చేస్తానని చెప్పి రైతాంగాన్ని వెన్నుపోటు పొడిచారని ఆవేదన వ్యక్తంచేశారు.

ఉపాధిహామీ పథకాన్ని నీరుగారుస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2022 – 23 బడ్జెట్ నుండి 33శాతం కోత విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో చదువుకున్న యువత సైతం గత్యంతరం లేక ఉపాధి పనులకు కోట్లలో దరఖాస్తు చేసుకున్నారని వాపోయారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారెడ్డి, రైతులు కెవివి సత్యన్నారాయణ, కాళ్ళ నాగేశ్వరరావు, ఓరుగంటి శివ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *