fbpx

పోలీసు వ్యవస్థ పనితీరుపై రౌండ్ టేబుల్ సమావేశం

Share the content

రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ నాయకులు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో పోలీసు వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు సిటిజన్స్ ఫర్ డేమోక్రసి సంస్థ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను సంస్థ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్, సహాయ కార్యదర్శి లక్ష్మణ్ రెడ్డి విడుదల చేశారు. త్రిసభ్య కమిటీ మొదటి సమావేశం విజయవాడలో ఈ నెల 13 న బెంజ్ సర్కిల్ సమీపంలో హోటల్ జెడ్ సూట్స్ సమావేశ మందిరంలో జరుగుతుందని తెలిపారు. పోలీసు వ్యవస్థ పనితీరుపై ఆసక్తి కలిగిన పౌర సమాజ సంస్థలు,ప్రజా సంఘాల,ప్రతినిధులు,మేధావులు,బాధితులు హాజరై తమ అభిప్రాయాలను తెలుపవచ్చునని పేర్కొన్నారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు కూడా అందించవచ్చునని తెలిపారు. వాటి సమస్యలపై త్రిసభ్య కమిటీ తగువిధంగా స్పందిస్తుందని వెళ్లడించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కమిటీలో సభ్యులుగా మాజీ డిజిపి ఎం.వి భాస్కర రావు, మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎ. సత్యప్రసాద్, మాజీ ది హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *