fbpx

పూర్తి పారద్శకతతోనే ఎన్నికలు : రాజీవ్ కుమార్

Share the content

రాష్ట్రంలో ఎన్నికలను స్వేచ్చాయుత వాతావరణంలో అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు.మంగళవారం విజయవాడలో నోవటెల్ హోటల్ వద్ద రానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత సమీక్ష లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని పార్టీలు ఇచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4.07 కోట్ల మంది ఉన్నారు.వారిలో మహిళలు 2.07 కోట్లు,పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు 5.8 లక్ష ల మందికి అవకాశం ఉంది అని తెలిపారు.తొలిసారి ఓటు హక్కు వినియోగించుకొనే వారి సంఖ్య 7.88 లక్షలు గా ఉన్నారు.అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో 139కట్టుదిట్టమైన నిఘా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఒక పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమన అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.గతంలో 20 లక్షలు పైగా ఓట్లను తొలగించారని పేర్కొన్నారు.అందులో పదమూడు వేలు ఓట్లను అక్రమంగా తొలగించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.సగటున ఒక్కో పోలింగ్ కేంద్రంలో 870 మంది ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ ,తెలంగాణ లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కొన్ని పార్టీలు తెలిపాయని..ప్రస్తుతానికి ఎక్కడ నివాసం అంటే అక్కడే ఓటు ఉండాలని తెలిపారు.

ఎన్నికల్లో ధన బలం వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.,వాలెట్ల ద్వారా అక్రమ ఆన్లైన్ బదిలీపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.రాష్ట్రంలో ఎయిర్ స్ట్రిప్స్ , హేలి ప్యాడ్ల పై సంబధిత అధికారుల పర్యవేక్షణ కు ఏజెన్సీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు..నాన్ షెడ్యూల్డ్ చార్టర్ ద్వారా సరుకు రవాణాను తనిఖీ చేయడం,విమానాలు ఇతర ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో సమాచారాన్ని పంచుకోవడం చేస్తామని పేర్కొన్నారు.పంపిణీకి ఎక్కువ అవకాశం ఉన్న సున్నితమైన వస్తువులను గుర్తించడం.మద్యం నిల్వలకు ఉపయోగించే గోధములు మూసివేత ఉంటుందని తెలిపారు. స్థానికంగా తయారు అయిన ఈలసిట్ మద్యం పై నిఘా, అటవీ మార్గాలపై కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో అన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *