fbpx

బాబు తీరు అనుమానమే.?

Share the content

చంద్రబాబు రాజకీయ తీరును బీజేపీ నమ్మడం లేదు. ఆయన ఏ క్షణమైనా ఎటువైపైన మొగ్గు చూపగలడు అని బీజేపీ నేతలకు అర్థమైంది. దీంతోనే వేచి చూసే ధోరణి అవలంబించాలని తొందరపాటుకు గురి కావాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ కు పూర్తిస్థాయిలో చెప్పి పంపించినట్లు అర్థమవుతోంది. ఇటీవల జాతీయ స్థాయిలో ఒకవైపు ఎన్డీఏ సమావేశం జరిగితే మరోవైపు ఇండియా కూటమి సమావేశం కూడా జరిగింది. ఈ రెండు సమావేశాల్లో దేనికి వెళ్లకుండా చంద్రబాబు తటస్థంగా ఉన్నప్పటికీ, ఎన్నికల సమయానికి అదును చూసి ఆయన ఎక్కువగా ఇండియా కూటమి వైపే మొగ్గు చూపవచ్చని బీజేపీ బలంగా భావిస్తుంది. 2019 ఎన్నికల్లోను చంద్రబాబు అంతర్లీనంగా కాంగ్రెస్ కూటమికి సహకరించారు అని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఆర్థిక అంశాలతో పాటు ఇతరత్రా అంశాల్లో యూపీఏ కూటమికి ఆయన సహకరించారు అని కేంద్రం వద్ద పటిష్టమైన రిపోర్టు ఉండటంతోనే ఇప్పటివరకు కనీసం చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కేంద్ర పెద్దలు అంతగా ఆసక్తి చూపలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో వచ్చే ఎంపీ సీట్లు బీజేపీకి అవసరం అయ్యే అవకాశం ఉంది.

చంద్రబాబు దారి ఎటు..?

దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన 25 ఎంపీ సీట్ల విషయంలోనూ బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, 25 ఎంపీ సీట్లు మద్దతు మాత్రం బిజెపికి వచ్చేలా పావులు కదుపుతోంది. మరోవైపు 2019 ఎన్నికల్లో చంద్రబాబు చేసిన సహాయం విషయంలోనూ గుర్రుగా ఉన్న కేంద్ర పెద్దలు చంద్రబాబును వెంటనే నమ్మాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా ఎన్నికల సమయానికి చంద్రబాబు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్లేటు తిప్పుతారని లేకపోతే మన వైపే ఆయన వస్తారని పవన్ కళ్యాణ్ కు హితబోధ చేసి పంపించారు. చంద్రబాబు రాజకీయం ఎటు నుంచి ఎటువైపున తిరిగే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో ముందుగానే చంద్రబాబును కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం లేదని కేంద్ర పెద్దలు చెప్పడంతోనే, పవన్ కళ్యాణ్ టిడిపి విషయంలో సైలెంట్ అయినట్లు తెలిసింది. దీంతోనే ఇటీవల జనసేన అని ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చేరడానికి వచ్చే ఎన్నికల్లో వైసిపి ఓటును చీల నివ్వకుండా చేయడానికి టిడిపి కూడా తన వంతు ప్రయత్నం మొదలు పెట్టాలని తాను మధ్యవర్తిత్వం చేయబోనని తేల్చి చెప్పారు. దీంతో ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో టిడిపి ప్రయాణం ఎటువైపు అన్నది అన్ని వర్గాలను వేధిస్తున్న ప్రశ్న. ఇటీవల మోడీ పాలన పై అనుకూలమైన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు బిజెపికి సిగ్నల్ ఇచ్చినప్పటికీ దానిని తీసుకునేందుకు మాత్రం కేంద్రం పెద్దలు సిద్ధంగా లేరు. అయినప్పటికీ చంద్రబాబు తర్వాత రోజుల్లో మోడీ పాలన మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఏమాత్రం వ్యాఖ్యలు చేయడం కానీ, మాట్లాడడం గాని లేదు. దీంతో ఇప్పుడు చంద్రబాబు వైఖరి మళ్లీ ఇండియా కూటమి వైపు వెళ్తుందా అన్న అనుమానం కూడా కలుగుతుంది. చంద్రబాబు సైతం దీని విషయంలో చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. ఆయన వైఖరి ఎటువైపు అన్నది ఇప్పటికే అంతు పట్టడం లేదు. ఒకవేళ ఎన్డీఏ వైపు చంద్రబాబు వస్తే కనుక రాష్ట్రంలో పొత్తులు విషయం పూర్తిస్థాయిలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ చంద్రబాబు కనుక ఇండియా కోటమివైపు మొగ్గుచూపితే కచ్చితంగా జనసేన బీజేపీ మాత్రమే రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని పోటీలో నిలవవచ్చు. రాష్ట్రంలో పొత్తుల వ్యవహారం అంతా చంద్రబాబు మైండ్ గేమ్ మీద రాజకీయ ఎత్తుగడ మీద మాత్రమే ఆధారపడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *