fbpx

కేంద్రం చెప్పినట్లు బాబు ఆడటమే!

Share the content

తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయదు అని ప్రకటించిన మరుసటిరోజే చంద్రబాబుకి బెయిల్ రావడం అనేది యాతృచికం అయిన… కచ్చితంగా తేడా మాత్రం ఎక్కడో కొడుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పొత్తులో ఉన్న జనసేన బిజెపితో తెలంగాణలో కలిసి వెళ్తామని చెప్పడంతోపాటు రేపో మాపో సీట్ల పంపకం విషయంలో కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేసిన పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోయినప్పటికీ ప్రాంతాల్లో అలాగే తెలుగుదేశం గతంలో బలంగా ఉన్న ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉండేది. ఏకంగా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మూసేసినట్లే ఇది అయింది. అంతటి త్యాగం చంద్రబాబు ఊరికే చేస్తాడు అనుకోవడం పొరపాటే. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సైతం పార్టీని వీడుతారని చంద్రబాబుకు తెలిసిన సరే తెలంగాణలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది అని అర్థం అయినా సరే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కచ్చితంగా బిజెపి సూచనలు పనిచేసాయ లేక మరి ఏదైనా కారణం పని చేసిందా అనేది చూడాలి.

** చంద్రబాబుకు బెయిల్ వచ్చే విషయంలో కచ్చితంగా పైనుంచి ఏదో జరిగింది అనే సందేహం అందరిలోనూ ఉంది. అయితే చంద్రబాబుకు వచ్చింది సాధారణ బెయిల్ కాదు. తాత్కాలిక బెయిల్ మాత్రమే. నవంబర్ 28వ తేదీన చంద్రబాబు మళ్ళీ జైలులో లొంగిపోవలసి ఉంటుంది. అయితే దీనిని పొడిగించుకునేందుకు కూడా వీలు ఉంటుంది. దానిని న్యాయవ్యవస్థ ఒప్పుకుంటుందా లేదా అనే దానిపైనే అసలు రాజకీయ ఆట ముడిపడి ఉంది అని గుర్తించాలి. ఒకవేళ న్యాయవ్యవస్థ కనుక చంద్రబాబు మధ్యంతర బెయిల్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటే గనక కచ్చితంగా చంద్రబాబు కు మంచి జరిగినట్లే. రాజకీయ ఆటలో చంద్రబాబు నెగ్గినట్లే. అలాకాకుండా మధ్యంతర భైలు రద్దు అయి మళ్ళీ చంద్రబాబు జైలులో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడి మరో రెండు మూడు కేసులు పెడితే కనుక కచ్చితంగా చంద్రబాబు రాజకీయ ఆటలో ఓడిపోయినట్లే. దీనిపై కేంద్ర బిజెపి తనకు అనుకూలమైన నిర్ణయం ఏ క్షణమైనా తీసుకోవచ్చు. కేంద్రం చెప్పినట్లు చంద్రబాబు వినడం మినహా కొన్ని రోజులు పాటు చంద్రబాబు చేతిలో కూడా చేసేది ఏమీ ఉండదు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు బయట లేకుండా ఉంటే కనుక తెలుగుదేశం పార్టీ ఎన్నికలను ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది. ఇది ఆ పార్టీ ఉనికిని కూడా దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *