fbpx

చంద్రబాబు ఆ కుటుంబాన్ని వాడుకొని వదిలేసారా??

Share the content

చంద్రబాబు నాయుడుకు రాజకీయాల్లో అయిన ఆర్థికంగా అయినా ఎవరినైనా వాడుకొని వదిలేయడం అలవాటు అంటారు.. దీనికి తగినట్లుగానే ఆయన సొంత జిల్లా చిత్తూరు చిత్తూరు జిల్లాలోని డీకే ఆది కేశవ నాయుడు కుటుంబాన్ని కూడా అలాగే వాడుకొని వదిలేసారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. డీకేఆర్ కేశవ నాయుడు మరణం తర్వాత ఆమె భార్య డీకే సత్యప్రభను బలవంతంగా రాజకీయాల్లోకి తీసుకువచ్చిన చంద్రబాబు నాయుడు తర్వాత ఆర్థికంగా వారిని వాడుకొని పూర్తిస్థాయిలో ఇప్పుడు వదిలేసారు అనేది చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతున్న చర్చ. 2019 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని సత్యప్రభ చెప్పినప్పటికీ చంద్రబాబునాయుడు దానిని పెడచెవిన పెట్టి ఆమెను రాజంపేట లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతోపాటు రాజంపేట లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గం వర్గాల పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయాని సత్యప్రభ అందించారు. అయితే తర్వాత ఓటమి ఎదురైంది. ఓటమి ఎదురైన తర్వాత కూడా చంద్రబాబు కనీసం డీకే సత్యప్రభను ఒక్కసారి కూడా పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించలేదు. పార్టీలోను సమచితస్థానం అందించలేదు. దీంతో డీకే కుటుంబాన్ని వైసీపీ పెద్దలు కలవడం మొదలుపెట్టారు.

వైసీపీలోకి వెళ్తారా??

డీకే సత్య ప్రభ కుటుంబ సభ్యుల్లో కొందరు ఇప్పటికే వైసీపీకి అనుకూలంగా కొనసాగుతున్నారు. దీంతో వైసిపి పెద్దలు సైతం డీకే సత్యప్రభుతో ప్రత్యక్షంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న డీకే సత్య ప్రభ మద్దతు కచ్చితంగా వైసీపీకి అవసరం అవుతుంది అని భావిస్తున్నారు. దీంతోపాటు వచ్చే ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి డీకే సత్యప్రభను అభ్యర్థిగా నిలబట్టే యోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వైసిపి పెద్దలు డీకే కుటుంబంతో తీవ్ర చర్చల్లో మునిగిపోయారు. డీకే సత్య ప్రభ కచ్చితంగా పార్టీ మారుతారు అని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ పార్టీ బలోపేతం మీద ఇప్పటికే దృష్టి పెట్టారు. డీకే కుటుంబంతో ఏమాత్రం తనకు ఇంక అవసరం ఉండదని భావించిన చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టిడిపికి పూర్తిస్థాయి పట్టున్నప్పటికీ నడిపించే నాయకత్వం లేదు. డీకే సత్య ప్రభ కచ్చితంగా పార్టీ మారితే కనుక ఆమెను ఆర్థికంగా బలంగా ఎదుర్కోగల నాయకత్వం కోసం టిడిపి చూస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *