fbpx

పేదల ప్రభుత్వం కాదు…పేదల రక్తం తాగే ప్రభుత్వం : చంద్రబాబు

Share the content

రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్రంలో పేదలకు,పెత్తందారులు మధ్య యుద్ధం జరుగుతుందని అంటున్నారని….దేశంలో అసలైన పెత్తందారు జగన్మోహన్ రెడ్డి అని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు. గుడివాడ లో టిడిపి చేపట్టిన “రా కదలిరా” బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకా 100 సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసారని మండిపడ్డారు.అన్నా క్యాంటీన్,విదేశీ విద్య దీవెన,చంద్రన్న భీమా,బిసి లకు సంబంధించి 30, ఎస్సీ లకు 27 పథకాలు రద్దు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత చేసి పేదలకు పెత్తందారులు కు యుద్ధం అంటున్నారు అని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తే పోలవరం,అమరావతి నిర్మాణాలు ఆగిపోతాయని ఊరూరూ తిరిగి చెప్పానని అని గుర్తు చేశారు. ప్రస్తుతం పోలవరం ను గోదావరి లో ముంచేసారని, అమరావతిని చెరపట్టారు అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

నాలుగేళ్లలో ఒక్క ఒక్కోక్క కుటుంబం పైన 4 నుంచి 6 లక్షలు వరకు భారం మోపారని పేర్కొన్నారు.200 రూపాయలు వచ్చే కరెంట్ బిల్ నేడు ఐదు రెట్లు పెరిగిందని,నిత్యావసర ధరలు పెరిగాయని పేర్కొన్నారు.ఒక సమర్థవంతమైన,సుపరిపాలన అందించడంలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు.జగన్ ఒక రాజకీయ వ్యాపారని, అధికారమంటే అతనకి ఒక దోపిడీకి ఒక మార్గమని అని పేర్కొన్నారు.బ్రిటిషర్లు వ్యాపారం కోసం వచ్చి రాజ్యాధికారం చేపట్టారు. దేశంలో ఉండే సంపదను అంత కొల్లగొట్టారనీ తెలిపారు. జగన్మోహన్ రెడ్డి కూడా సొంత వ్యాపార సంస్థ పెట్టారు. ఎక్కడికక్కడ ఇసుక,మద్యం, భూకుంభకోణాలుతో దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.

  • భూ రక్షణ చట్టం కాదు భూ భక్షణ చట్టం
    రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా సొంత భూమిలో దొంగలు పడతారు అని విమర్శించారు.దుర్మార్గుల చేతిలో టెక్నాలజీ ఉంటే అత్యంత ప్రమాద అని పేర్కొన్నారు.మి భూమి పక్కన వ్యక్తి 22- ఏ అని ఒక లెటర్ రాసి అధికారికి ఇస్తే మి భూమి చిక్కుల్లో పడుతుంది అని పేర్కొన్నారు. భూమిలో సమస్యలు వస్తే అంతిమ నిర్ణయం హైకోర్ట్ కు ఇచ్చారని మండిపడ్డారు. ఎంతమంది మాత్రం హైకోర్ట్ కు వెళ్ళగలరని ప్రశ్నించారు.టీడీపి జనసేన ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మీ బిడ్డ అంటూ జగన్ ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని… నువ్వు మా బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని చెప్పాలని పిలుపునిచ్చారు. గుడివాడ లో బూతుల మంత్రి.. బందరు లో నీతుల మంత్రి ఉన్నారని తెలిపారు.సంక్రాంతి పండగ సందర్భంగా క్యూసినోలు, పేకాటలు పెట్టారని మండిపడ్డారు.నోరు ఉన్నదనీ పారేసుకోవద్దు అని హెచ్చరించారు. అహంభావం తో విర్రవీగే వ్యక్తులను కాలగర్భంలో కలిపివేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *