fbpx

శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్ చెప్తుంది

Share the content

తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆపార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం క్రైస్తవ సంఘాలను, సంస్థలను ఇబ్బంది పెడుతుందని పలువురు మత పెద్దలు విమర్శించారు. మళ్లీ రాష్ట్రానికి మంచి జరిగేలా చంద్రబాబును దేవుడు అనుగ్రహిస్తారు అంటూ మత పెద్దలు దీవెనలు ఇచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మానవ ప్రయత్నానికి దేవుని అశీస్సులు కావాలని అప్పుడే సంకల్పం నెరవేరుతుంది అని తెలిపారు. సమస్త మానవాళి రక్షణ కోసం దేవుడు ఏసు మానవ రూపంలో వచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వం తరుపున సెమీ క్రిస్మస్ నిర్వహించే కార్యక్రమ విధానాన్ని ఉమ్మడి రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం తీసుకువచ్చింది అని తెలిపారు. శత్రువును కూడా ప్రేమించాలి అని బైబిల్ చెపుతోంది. కానీ మిత్రుడిని కూడా శత్రువుగా చూసే పరిస్థితి నేడు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రిస్టియానిటీ అంటేనే సేవని స్కూళ్లు, కాలేజీలు, ఆసుపత్రులు పెట్టి క్రిస్టియన్ మిషనరీలు నేడు సేవ చేస్తున్నాయి అని పేర్కొన్నారు. ఎయిడెడ్ సంస్థలకు గత ప్రభుత్వాలు గ్రాంట్ ఇచ్చి ప్రోత్సహించాయి.కానీ నేడు ఆ ఆస్తులుకొట్టేసే ప్రయత్నం జరుగుతోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • రంగనాయకమ్మ పేరులో కులం చూశారు.
    విశాఖపట్నం ఎల్ జి పాలిమర్స్ ఘటనపై ట్విట్టర్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేసిన గుంటూరుకి చెందిన శంకర్ విలాస్ హోటల్ యజమాని రంగనాయకమ్మ పై అక్రమ కేసు పెట్టారని విమర్శించారు. అనేక ఇబ్బందుల అనంతరం ఆమె ఇతర వ్యాపారం మొదలు పెడితే దాన్ని కూడా అడ్డుకున్నారన్నారు. మానసికంగా ఇబ్బంది పడిన ఆమె ఇక్కడ బతకలేమని భావించి హైదరాబాద్ వెళ్లిపోయిందనీ పేర్కొన్నారు.
  • గంజాయి విషయం మీద మాట్లాడినందుకు టిడిపి కార్యాలయం పై దాడి.
    రాష్ట్రంలో గంజాయి విపరీతంగా ఉంది అని తెలిపినందుకు టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి చేశారని విమర్శించారు. రాజకీయ పార్టీలపైనే ఇలాంటి దాడులు చేస్తే…ప్రజా సమస్యలపై ఎవరు మాట్లాడుతారని ప్రశ్నించారు.రాష్ట్రంలో వ్యవస్థలు అన్నీ భ్రష్టు పట్టాయని విమర్శించారు. సమాజ హితం కోసం పనిచేయమని ఏసుప్రభువు చెప్పారు. ఎన్నికలకు ఇంకా 100 రోజులు మాత్రమే ఉందిని, ప్రజలు అంతా ఆలోచించాలని పేర్కొన్నారు.
  • మూడు రాజధానులు అంటూ విధ్వంసం
    టిడిపి హయాంలో మొదలు పెట్టిన హైదరాబాద్ అభివృద్దిని నాటి వైఎస్ఆర్ నుంచి నేటి రేవంత్ రెడ్డి వరకు కొనసాగిస్తూ ఉన్నారని తెలిపారు. కానీ మన ఎపిలో మాత్రం అమరావతిని నాశనం చేశారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మూడు రాజధానులు అంటూ విధ్వంసం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
  • పేద బిడ్డ ప్యాలెస్ ఖర్చు 500 కోట్లు
    గత టిడిపి ప్రభుత్వంలో గుంటూరు చర్చికి పది కోట్లు ఇస్తే ఇప్పటివరకు దాన్ని పూర్తి చెయ్యలేదని, విశాఖపట్నం లో రూ.500 కోట్లతో ప్యాలెస్ కట్టి నేను పేదల బిడ్డనంటున్నాడని మండిపడ్డారు. విశ్వంలో ఎవరు శాశ్వతంగా ఉండరని, కానీ సమాజం శాశ్వతం. సమాజం కోసం పనిచేయాలి అందరూ పని చేయాలని పిలుపునిచ్చారు.
  • టిడిపితోనే క్రైస్తవులుకు న్యాయం
    టిడిపి ప్రభుత్వంలో క్రైస్తవులు జెరూసలేంకు వెళ్లేందుకు రూ. 50 వేల ఆర్థిక సాయం చేశామని గుర్తు చేశారు.గుంటూరులో రెండు ఎకరాల్లో క్రిస్టియన్ భవనం నిర్మాణానికి రూ. 10 కోట్లు ఇచ్చామనితెలిపారు. విజయవాడ చర్చికి 1.5 కోట్లు ఇచ్చామని,శ్మశాన వాటికలకు భూమి కావాలి అంటే…ప్రత్యేక భూసేకరణ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. క్రిస్మస్ రోజు పేదలు కూడా పండుగ చేసుకోవాలని క్రిస్మస్ కానుకలు ఇచ్చామన్నారు. చర్చ్ ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సాయం చేశామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *