fbpx

అవకాశం జారవిడుచుకున్న బిజెపి

Share the content

తెలంగాణలో టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అవుతుంది అనుకున్న బిజెపి ఒక్కసారిగా డీల పడడం ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే బిజెపి ఈ ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధిస్తుంది కనీసం ఉనికి చాటుకుంటుందా అనే అనుమానం కలుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తున ఉత్సాహంతో ముందుకు వెళుతుంటే బీజేపీ మాత్రం దానికి విరుద్ధంగా పనిచేస్తోంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణలో కచ్చితంగా బిజెపి జెండా పాతుతుంది అనేలా క్యాడర్ లో వచ్చిన ఉత్సాహం ఒక్కసారిగా చప్పబడింది. బిజెపి కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణపై దృష్టి సారించి ఒకరి తర్వాత ఒకరిగా పర్యటనలు చేయడం బహిరంగ సభలు పెట్టడంతో కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు బిజెపికి మధ్య పోరు ఉంటుంది అనేలా పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. తెలంగాణ ఎన్నికలకు దాదాపు నెలరోజులు మాత్రమే సమయం ఉన్న సమయంలో బిజెపి ఇప్పుడు కనీసం ఉనికి చాటుకునే ప్రయత్నం చేయడం, తెలంగాణలో ఏ మాత్రం ఉనికిలో లేని జనసేనతో పొత్తు పెట్టుకోవడం చూస్తుంటే బిజెపి తెలంగాణ ఎన్నికలను లైట్ తీసుకుంటుందా అనే అనుమానం కలుగుతుంది.

** తెలంగాణ ఎన్నికలు ఇప్పుడు పూర్తిగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీకి మధ్య వాతావరణం కనిపిస్తోంది. పూర్తిస్థాయి ప్రత్యర్థి పార్టీలుగా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ తలపడే అవకాశం కనిపిస్తోంది. బండి సంజయ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంతకాలం బిజెపి తిరుగులేని శక్తిగా కచ్చితంగా తెలంగాణలో జెండా పాతే అవకాశం ఉన్న పార్టీ గా కనిపించింది. అయితే ఒక్కసారిగా బిజెపి కేంద్ర నాయకత్వం తెలంగాణపై పట్టు సడలించినట్లు కనిపించింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతోనే బిజెపి తెలంగాణపై పట్టు వదిలేసినట్లు అర్థమైంది. మరో పక్క కాంగ్రెస్ పార్టీ క్రమక్రమంగా తెలంగాణపై పట్టు పెంచుకుంది. కాంగ్రెస్ అగ్ర నాయకత్వం తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టడం రాహుల్ గాంధీ తరచూ పర్యటనలు చేయడంతో కాంగ్రెస్ లో ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు బిజెపి పరిస్థితి తెలంగాణలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి గా తయారైనట్లు కనిపిస్తోంది. తెలంగాణలో ఏమాత్రం ప్రభావం చూపని జనసేన పార్టీతో ఆఖరికి పొత్తు పెట్టుకునే పరిస్థితికి బిజెపి వచ్చింది. పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం పొత్తు దాదాపు ఖరారు కావడం చూస్తుంటే కచ్చితంగా జనసేన పార్టీ అడిగిన అన్ని సీట్లు బిజెపి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 119 నియోజకవర్గాల్లో బిజెపికి బలమైన అభ్యర్థులు లేకపోవడంతోనే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంది అన్న అపవాది కూడా ఇప్పుడు కనిపిస్తోంది. ఏది ఏమైనాప్పటికీ తెలంగాణలో బిజెపి కావాలనే బలమైన శక్తిగా అవతరించే అవకాశాన్ని వదులుకుందా అంటే ఆ పార్టీ క్యాడర్ కూడా అది నిజమని చెబుతున్నాయి. బండి సంజయిని తొలగించడంతోనే బిజెపి అగ్రనాయకత్వం తెలంగాణ తమకు ప్రాధాన్యం లేదని చెప్పినట్లు అయిందని… వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తమకు కలిసి వస్తుందని నమ్మకంతోనే బిజెపి అగ్రనాయకత్వం మొత్తం వదిలేసిందని అపప్రదా ఇప్పుడు తెలంగాణ అంతటా కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *