fbpx

సచివాలయాల ఉద్యోగులకు తలనొప్పిగా బయోమెట్రిక్

Share the content

సచివాలయ ఉద్యోగులకు రోజుకు రెండు సార్లు హాజరు తప్పనిసరి అనే విధానం తలనొప్పిగా మారింది. ప్రభుత్వ శాఖల అజమాయిషీలో పని ఒత్తిడితో సతమవుతున్న గ్రామ వార్డు సచివాలయాలకు హాజరు నమోదు తప్పనిసరి అనే విధానం అమలులోకి తీసుకువచ్చారు బయోమెట్రిక్ లేదా ముఖ ఆదరిత హాజరు నమోదైన రోజుకు మాత్రమే వేతనం ఇవ్వాలని హాజరు నమోదు కానీ రోజుకు వేతనంలో కోత విధించాలని ఉన్నత స్థాయి నుండి మార్గదర్శకాలు వచ్చాయి. సాంకేతి కారణాలతో హాజరు పడకపోయినా క్షేత్రస్థాయిలో సేవలు అందించేందుకు వెళ్లి వేలు ముద్ర వేయడం కుదరకపోయినా జీతం లో కోత తప్పదు. ఈ నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇకపై సచివాలయ ఉద్యోగులు రోజులో మూడుసార్లు బయోమెట్రిక్ వేయాలని రోజుకు రెండుసార్లు తప్పనిసరిగా హాజరు వేయకపోతే ఆరోజు సెలవుగా పరిణలోకి తీసుకుంటారు.

డీఈఓ,మున్సిపల్ కమిషనర్లు ఎండివోల పర్యవేక్షణలో హాజరు …

డీఈఓ గా ఉన్న మున్సిపల్ కమిషనర్లు ఎండివోలు సచివాలయ ఉద్యోగుల హాజరును సక్రమంగా నమోదు అయిందా లేదా అని పరిశీలించి జీతభత్యాలు రూపకల్పన చేస్తారు. సచివాలయ ఉద్యోగులతో జీతభత్యాల హాజరుతో ముడి పెట్టడంపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. కార్యాలయాల విధులు కంటే క్షేత్రస్థాయి పౌర సేవలోనే ఎక్కువ మంది పాల్గొంటున్నారు. ప్రస్తుత పట్టణాల్లో గ్రామాల్లో ఆస్తి ఇంటి పనులతో పాటు వివిధ రకాల పనులను సచివాలయం అడ్మిన్లు సిబ్బంది వసూలు చేస్తున్నారు. దీంతో పాటు జగనన్న నిర్మాణాలను సచివాలయ ప్లానింగ్ సిబ్బంది ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారు ఈ లేఔట్లు సచివాలయాల కు ఊరికి చాల దూరంగా ఉండటంతో వెళ్లి తిరిగి వచ్చేసరికి సాయంత్రం హాజరు సమయం దాటిపోతుందని రోజుకు రెండుసార్లు హాజరు పడకపోతే సెలవుగా పరిగణలు చేస్తున్నారని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.స్థానిక రాజకీయనాయకులు పార్టీ కార్యక్రమాలతో సతమతం అవుతున్న తమకు హాజరుతో వేతనాన్ని ముడి పెట్టడం సరికాదని పేర్కొంటున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కారంతో పాటు క్షేత్రస్థాయి సిబ్బందికి హాజరు మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *