fbpx

మాదిగ ఓట్లకు పెద్ద టెండర్! ట్రిక్ ఫలిస్తే వైసీపీకి నష్టమే!!

Share the content

ఎమ్మార్పీఎస్ మూడు దశాబ్దాలుగా చేస్తున్న అతిపెద్ద ఉద్యమానికి బిజెపి మద్దతు పలకడం, బహిరంగంగా ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఎస్సీ వర్గీకరణకు తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పడం నిజంగా పెద్ద విషయం. ఇది రాజకీయంగాను సామాజికంగానూ పెద్ద మార్పు తెచ్చేది. ఎస్సీ సామాజిక వర్గంలో మొత్తం 59 కులాలు ఉంటే మాదిగలకు చాలా తక్కువ మొత్తంలో ప్రతిఫలం కలుగుతోందని మాదిగలు ఎప్పటినుంచో పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలను విభజించినట్లుగా ఏబిసిడిలుగా ఎస్సీలను సైతం విభజించాలి అని… దీనిలో భాగంగా మాదిగలకు సంబంధించి అత్యధిక రిజర్వేషన్ ఫలాలు దక్కుతాయి అనేది ఉద్యమం యొక్క ప్రాథమిక సారాంశం. 1994లో ఒంగోలు వేదికగా మొదలైన ఎమ్మార్పీఎస్ ఉద్యమం దసలవారీగా చాలా ఒకానొక సమయంలో పిక్ దశలోకి వెళ్ళింది. ఎస్సీ వర్గీకరణ కోసం మొదటి నుంచి అన్ని ప్రభుత్వాలను కోరుతూ వస్తున్న ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ మాదిగకు మాదిగలవర్గం నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. ఒకానొక సమయంలో ఎస్సీలను కచ్చితంగా వర్గీకరించాల్సిందే అని ఎమ్మార్పీఎస్ చేసిన డిమాండ్ ను దాదాపు అన్ని ప్రభుత్వాలు స్థాయి వరకు వచ్చినప్పటికీ మాలవర్గం నుంచి వచ్చిన డిమాండ్ మేరకు వర్గీకరణ కు చాలా చోట్ల బ్రేకులు పడ్డాయి. అయితే ఎప్పుడు కూడా ప్రధానమంత్రి స్థాయి వరకు ఈ అంశం వెళ్లలేదు. అసెంబ్లీలో పలుమార్లు తీర్మానాలు చేసినప్పటికీ దీనిని పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే వర్గీకరణ సాధ్యం కావడంతో.. ఆ దశ వరకు ఎస్సీ వర్గీకరణ అంశం వెళ్లలేదు. అయితే తెలంగాణ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా మాదిగలకు అభయం ఇవ్వడం ఇప్పుడు రాజకీయంగా కీలకము కానుంది. ఇది తెలంగాణలో పూర్తిస్థాయిలో పని చేయకపోయినా ఆంధ్రలో మాత్రం పూర్తిస్థాయిలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

** ఆంధ్రాలో దళిత సామాజిక వర్గం ఓట్లు వైసిపికి వరం. దాదాపుగా 80 శాతం వరకు ఓటర్లు జగన్ కు మద్దతు తెలుపుతున్నారు. మొత్తం జనాభాలో సుమారుగా 19 నుంచి 23 శాతం మధ్యలో వీరి జనాభా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ముఖ్యంగా మాలా మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధికం. అందులోనూ దీనిలో కూడా మాల సామాజిక వర్గం కంటే మాదిగ సామాజిక వర్గం ఓట్లు అధికమని కొన్ని కొన్ని ప్రాంతాల్లో అవి నియోజకవర్గ ఫలితాన్ని కూడా తారుమారు చేసే స్థాయిలో ఉన్నాయని తెలుస్తోంది. దీంతో మూకుమ్మడిగా జగన్ కు మద్దతు తెలుపుతున్న దళితుల ఓట్లను చీల్చే దశగా కచ్చితంగా ఎస్సీ వర్గీకరణ అంశం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టి బిజెపి ఆంధ్రలో కూడా జనసేన తెలుగుదేశం కూటమికి మద్దతు పలికే అవకాశం ఉంది. అక్కడ కూడా బిజెపి జత కడితే మూకుముడిగా మూడు పార్టీలు ప్రధానితో సహా సభలు పెట్టిస్తే కనుక ఎస్సీ వర్గీకరణకు పూర్తిగా అనుకూలంగా ఉన్నట్లు గనుక సంకేతాలు పంపితే దళితుల ఓట్లలో కచ్చితంగా చీలిక రావచ్చు. కృష్ణ మాదిగ కూడా దీనికి అనుకూలంగా ఉండి బిజెపికి సహకరిస్తామని సభా వేదిక సాక్షిగా చెప్పడంతో… కచ్చితంగా ఆంధ్ర ఓటర్ల మీద ఆ ప్రభావం పడుతుంది. ఆంధ్రాలో సైతం ఇదే తీరున ఎస్సీ వర్గీకరణ విషయంలో ముందుకు వెళితే కనుక బిజెపికి కొత్త బలం చేకూరినట్లే. కచ్చితంగా మందకృష్ణ మాదిగ బిజెపికి అండగా నిలవాలని నిర్ణయించి ప్రధానమంత్రి కనుక ఎస్సీ వర్గీకరణకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని చెబితే కనుక ఎస్సీ వర్గంలోని కీలకమైన మాదిగ ఓటర్లలో కొంతమేర చీలిక తెచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఇది కచ్చితంగా వచ్చే రాజకీయ పరిస్థితులను మార్చే అవకాశం ఉంది. అయితే రాజకీయ పరిణామాలు ఎప్పుడు ఏ దశను తీసుకుంటాయో చెప్పలేం కాబట్టి ముందుగానే దీనిని ఊహించడం కష్టం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *