fbpx

బిజెపిని ఓడించడమే భగత్ సింగ్ కు ఇచ్చే నిజమైన నివాళి : తాటిపాక మధు

Share the content

భారతదేశ స్వాతంత్రం సాధించిన విజయాలను,రాజ్యాంగాన్ని లౌకిక ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓడించడమే విప్లవీరులు భగత్ సింగ్, రాజు గురు, సుఖదేవ్, ఇచ్చే నిజమైన నివాళి అని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలిపారు. దేశ ముద్దుబిడ్డలు భగత్ సింగ్ రాజ్ గురు ,సుఖదేవ్ ,ల 93వ వర్ధంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నివాళుల కార్యక్రమాలు జరిగాయి . శనివారం ఉదయం స్థానిక కూరగాయలు మార్కెట్ వద్ద భగత్ సింగ్ విగ్రహానికి సిపిఐ ఏఐటియుసి ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యదర్శి , సహాయ కార్యదర్శి తాటిపాక మధు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ… ఈ దేశ స్వాతంత్రం కోసం ఉరితాడు ను ముద్దాడిన విప్లవ వీర కిశోరాలు భగత్ సింగ్ చరిత్రను నేడు విద్యార్థి యువత అధ్యయనం చేయాలని వారి ఆశయాలను అమలు చేయాలని వారు పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలని కోరారు. భగత్ సింగ్ ఏ లక్ష్యం కోసం అయితే పోరాడారో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదని ఆ స్వతంత్ర ఫలాలు పేద ప్రజలకు అందడం లేదని విమర్శించారు భగత్ సింగ్ కలలగన్న భారతదేశం నేడు బడా కార్పొరేట్ చేతుల్లో బందీగా మారిపోయిందిని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని కులాలు మతాలు ప్రాంతాలతో విడదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశానికి మూలమైన లౌకిక రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారని మరొకసారి మోడీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారని తెలిపారు. ఇప్పటికే భారతదేశ చరిత్రను మార్చి వేస్తున్నారని భగత్ సింగ్ లాంటి స్వాతంత్ర పోరాటాల చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించారని వాపోయారు.

ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్ ఏవైఎఫ్ జిల్లా కన్వీనర్ కే శ్రీనివాస్ లు మాట్లాడుతూ… పంజాబ్ ఉన్న లాయల్ జిల్లా బంగా అనే గ్రామంలో కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించారని తెలిపారు. రిపబ్లిక్ పార్టీ లో ఒక సభ్యుడుగా ఉండేవాడని వారన్నారు. ఢిల్లీ వీధుల్లో బ్రిటిష్ వారిని గడగడలాడించిన మహోన్నత వ్యక్తి. స్వాతంత్రం మా జన్మ హక్కు అంటూ బ్రిటిష్ పార్లమెంటుపై బాంబు విసిరిన ధైర్యశాలి భగత్ సింగ్ అని కొనియాడారు. భగత్ సింగ్ ఆశయాలను దేశ ప్రజలు ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు జట్లు సంఘ ప్రధాన కార్యదర్శి సప్పా రమణ అధికార బాడి సభ్యులు పెంటా దేవుడు బాబు,రేక్కం బాలకృష్ణ, రెడ్డి వెంకట్రావు, కాళ్ల అప్పలనాయుడు , ఆర్గనైజింగ్ సెక్రటరీ నల్ల రామారావు, కూరగాయలు సెక్షన్ సభ్యులు గుమ్మడి అప్పారావు ,ఎస్ రాజు ,చిన్నికృష్ణ ,పి శ్రీను, అప్పలనాయుడు ,పాపారావు పార్టీ సీనియర్ నాయకులు సేపేని రవణమ్మ ,వానపల్లి సూర్యనారాయణ, గన్ని ముత్యాలు, డి నాయుడు, డిహెచ్పిఎస్ సాగర్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *