fbpx

వైసీపీకి బాహుబలి సేవలు!

Share the content

వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి దివంగత నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఉండే అవకాశం 100% కనిపిస్తోంది. నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం రాజు మొదటి నుంచి వైసీపీకి ప్రతికూలంగానే పనిచేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గ అభ్యర్థిగా కొత్త వ్యక్తిని వెతుక్కునే పనిలో వైసీపీ పడింది. గతంలో నరసాపురం ఎంపీగా కృష్ణంరాజు బీజేపీ తరఫున పనిచేశారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టడం రివాజుగా వస్తోంది. దీంతో అధికార పార్టీ కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని తమ అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనిపై ఎప్పటికీ కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు నటుడు ప్రభాస్ తోను వైసీపీ అధి నాయకులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీనికి కృష్ణంరాజు కుటుంబ సభ్యుల నుంచి సానుకూల స్పందన కూడా లభించినట్లు సమాచారం.

ప్రభాస్ కోసం కూడా

వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీకి స్టార్ క్యాంపెయిన్లు లేకపోవడంతో ఖచ్చితంగా ప్రభాస్ ను ఎలాగైనా వినియోగించుకోవాలని వైసీపీ వ్యవహరచన చేస్తోంది. ఇప్పటికే క్రికెటర్ అంబటి రాయుడును గుంటూరు జిల్లా మొత్తం మీద తిప్పుతూ ఆయనకు వచ్చే ఎన్నికల్లో కూడా గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని భావిస్తున్న వైసీపీ పెద్దలు ఇప్పుడు నరసాపురం నుంచి కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించి దానిలో భాగంగా ప్రభాస్ సేవలను వైసిపికి అనుకూలంగా మార్చుకునేలా పావులు కదుపుతున్నారు. ఎప్పటికీ ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ బాగా పనిచేస్తున్నారని కితాబు ఇవ్వడం దానిని వైసిపి సోషల్ మీడియా బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం చూస్తుంటే కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభాస్ సేవలు వైసీపీ వాడుకునే అవకాశాన్ని కొట్టి పారేయలేం అన్నట్లు కనిపిస్తోంది. దీంతోపాటు పెద్దమ్మ కు వైసిపి టికెట్ కేటాయిస్తే ఆమె తరఫున నర్సాపురం నియోజకవర్గంలో ప్రభాస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తోంది. కేవలం నర్సాపురం నియోజకవర్గానికి ప్రభాస్ పరిమితం అవుతారా లేక వైసిపి తరఫున రాష్ట్రంలోనూ స్టార్ క్యాంపెయిన్గా వివిధ సభలో పాల్గొంటారా అన్నది వచ్చే కొద్ది రోజుల్లో తెలియనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *