fbpx

వైద్య కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Share the content

వైద్య విద్యా డైరెక్టరేట్ ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 31 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతా ప్రమాణాలు, సవివరమైన మార్గదర్శకాలు https://dme.ap.nic.in/ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆసక్తికలిగిన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్లో ఈ నెల 8వ తేదీ నుండి 17వ తేదీ లోగా సమర్పించాలని ఆయన సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *