fbpx

ఆ నలుగురు మాజీలకు టికెట్ లేనట్లే?

Share the content

జగన్ తొలి క్యాబినెట్ లోనే మంత్రి పదవులు సంపాదించిన కీలకమైన వ్యక్తులకు వచ్చే ఎన్నికల్లో వైసీపీ టికెట్ కేటాయించేది కూడా కష్టమే అన్నది ఆ పార్టీ అధిష్టానం పంపుతున్న సంకేతాలకు అర్థం చెబుతోంది. తొలి క్యాబినెట్ లోనే సామాజిక సమీకరణాలు వివిధ రకాల కారణాలతో క్యాబినెట్ లోకి తీసుకున్న మంత్రులు తర్వాత కాలంలో వారి పనితీరులో వచ్చిన మార్పు కారణంగా కావచ్చు లేదా స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల కావచ్చు పూర్తిగా గ్రాఫ్ పడిపోయినట్లు జగన్ అంతర్గత సర్వేలో తేలింది. ఎప్పటికప్పుడు సర్వేలను చేయిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మొత్తం వైసీపీలో 40 మంది పేర్లను హిట్ లిస్టులో పెట్టారు. ఆ 40 మంది పనితీరు ఏమాత్రం బాగాలేదని, సర్వేల్లో సైతం ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఎవరూ మాట్లాడకుండా వచ్చినట్లు తేలింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆ 40 మందితో పాటు గత క్యాబినెట్లో కీలకంగా వ్యవహరించిన నలుగురు మంత్రులకు కూడా వచ్చే ఎన్నికల్లో చుక్క ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది.

ఎవరా నలుగురు?

జగన్ మొదటి క్యాబినెట్ లోనే ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు కీలకమైన రోజుల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ కు స్థానికంగా పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు జగన్ అంతర్గత సర్వేలో తేలింది. మొదటినుంచి ఆళ్లకాళీకృష్ణ శ్రీనివాస్ కు జగన్ పదేపదే హెచ్చరిస్తున్న చాలా రోజుల వరకు గడపగడపకు కార్యక్రమం కూడా ఆయన చేపట్టలేదు. దీంతోపాటు ఆయన గ్రాఫ్ విపరీతంగా పడిపోయినట్లు తేలింది. తర్వాత వరుసలో జగన్ మొదటి క్యాబినెట్లో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేసిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వెల్లంపల్లి మీద సొంత పార్టీతో పాటు కీలకమైన ముస్లిం సామాజిక వర్గంలో కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సొంత పార్టీ క్యాడర్ కార్యకర్తలను సైతం వెల్లంపల్లి పట్టించుకోవడం లేదన్న అపవాదు ఉంది. ఇక మూడో మంత్రిగా మచిలీపట్నం ఎమ్మెల్యే, జగన్ మొదటి క్యాబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పనిచేసే జగన్ మీద ఈగ వాళితే వెంటనే స్పందించే పేర్ని నాని పేరు కూడా ఉండడం విశేషం. మచిలీపట్నం పరిస్థితులు పేర్ని నానికి అతని కొడుకు కృష్ణమూర్తికి కూడా పూర్తిగా వ్యతిరేకం అయ్యాయని, పేర్ని కుటుంబం నుంచి ఎవరిని వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన అక్కడ వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేలింది. పేర్ని నాని మీద విపరీతమైన అవినీతి ఆరోపణలతో పాటు కాపు సామాజిక వర్గంలో కూడా తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు అర్థమవుతుంది. ఇక భీమిలి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్ జగన్ మొదటి క్యాబినెట్లో పర్యటన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కాలంలో కొంత రాజకీయంగా పలు ఆరోపణలు చేసినప్పటికీ తర్వాత ఎందుకో గాని ఆయన పూర్తిగా సైలెంట్ గా అయిపోయారు. అయితే అధికార పార్టీ చేయించిన సర్వేలో అవంతి శ్రీనివాస్ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు, స్థానికంగా ఆయనకు అన్ని రకాల చెడ్డ పేర్లు వచ్చినట్లు జగన్ అంతర్గత సర్వేలో తేలింది. ఇప్పటికే వీరందరికీ వ్యక్తిగతంగా జగన్ పలుమార్లు చెప్పిన వీరు తీరులో ఏమాత్రం మార్పు కనిపించకపోవడంతో పాటు స్థానిక పరిస్థితులు కూడా ప్రతికూలంగా మారడంతో ఈ నలుగురు మాజీ మంత్రులకు జగన్ వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయించేది కష్టమే అన్నది వైసీపీ అంతర్గత సమాచారం. అయితే వీరిలో కొందరిని లోక్సభకు పోటీ చేయించవచ్చని తెలుస్తోంది. అయితే అప్పటికప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా మాత్రమే జగన్ ఈ నిర్ణయం తీసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *