fbpx

ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు : సీపీఐ, సీపీఎం

Share the content

రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సహకారం తో బిజెపి బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది.ఒక పక్క ప్రత్యేక హోదా ఇవ్వకుండా,విభజన హామీలు అమలు చేయకుండా ,విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిన విద్రోహ పార్టీ బిజెపి అని సీపీఐ,సీపీఎం ఉమ్మడి కమిటీ విమర్శించింది. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలవరం ,రాజధాని కి నిధులు ఇవ్వకపోయినా తెలుగుదేశం ,జన సేన పార్టీలు బిజెపి కి కొమ్ము కాస్తున్నయని తెలిపారు.వైయస్సార్ సిపి పూర్తిగా లొంగిపోయి అనధికార ఎన్డీయే సభ్యురాలిగా కొనసాగుతున్నది.రాష్ట్ర పార్టీలు బిజెపి తో కలవడం రాష్ట్ర వినాశనానికి ,మత సామరస్యం దెబ్బ తినడానికి ,సమాజిక న్యాయానికి విఘాతం కలగడానికి దారి తీరుస్తుంది. ఈ శక్తులను రానున్న ఎన్నికల్లో అడ్డుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని రాష్ట్ర ప్రజలకు గుర్తు చేశారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రజలపై భారాలు వేయడమే కాకుండా ప్రశ్నిస్తున్న ప్రజలను అనచివేస్తుంది అని తెలిపారు.ప్రభుత్వ సంపదను బడా కార్పొరేట్లకు పరం చేస్తుంది.టిడిపి,వైసిపి,జనసేన లు ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బిజెపిని వ్యతిరేకించే లౌకిక పార్టీలు,రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కోరుకునే పార్టీలు,సంఘాలు,సంస్థలు,వ్యక్తులు,శక్తులు ఉమ్మడి గళం వినిపించాలని పిలుపునిచ్చారు. పరస్పరం సహకరించుకొని పని చేయాలని కోరారు. ఈ లక్ష్యంతో ఈ నెల 20 న విజయవాడ లో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిరభిస్తున్నమని తెలిపారు. ఈ సదస్సులో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు గిడుగు రుద్రరాజు,సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ,సిపిఎం రాష్ట్ర కార్యదర్శిలు రామకృష్ణ,వి.శ్రీనివాసరావు,మాజీ ఎమ్మెల్యే ఎం. ఎ గఫూర్,లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.మూర్తి, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వి.వి లక్ష్మి నారాయణ, వివిధ సంఘాల సంస్థలు ప్రతినిధులు పాల్గొననున్నారు అని ప్రకటనలో తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *