fbpx

గంగవరం పోర్టును అప్పనంగా అదానికు కట్టబెట్టిన జగనన్న : వైయస్ షర్మిల

Share the content

రూ.70,000 కోట్లు విలువ చేసే గంగవరం పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం 600 కోట్లకు అదాని కు కట్టబెట్టారని కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు వైయస్ షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం వద్ద 1100 రోజులుకు పైగా నిరసనలు చేస్తున్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు ఆమె మద్దతు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రయవేటికరణ ను కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడ్డుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత ప్లాంట్ కు కావలసిన ముడి సరకు అయిన ఐరన్ ఓర్ ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలంటే…కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ గురుంచి పట్టించుకొనే నాధుడే లేదని పేర్కొన్నారు.

తమ స్వలాభం కోసం టిడిపి,వైసిపి లు రాష్ట్రాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రధాన ప్రాంతీయ పార్టీలు బీజీపీ కి బానిసలు అయినా… రాష్ట్ర ప్రజలు బానిస కావటానికి వీల్లేదు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నే విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడుతుంది అని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి తలమానికం అని పేర్కొన్నారు .గతంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 3 మిలియన్ టన్నుల సామర్థ్యం నుంచి 7 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉత్పత్తి కి తీసుకువెళ్లారన్నారు. ప్రస్తుత నాయకులకు స్టీల్ ప్లాంట్ మీద చిత్త శుద్ధి లేదన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉండగా ప్రభుత్వ ఆస్తులను ప్రజల ఆస్తి గా భావించి కాపలాగా ఉన్నారన్నారు.

విశాఖ స్టీల్ పాలంట్ ను కేంద్ర, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ప్రైవేటీకరణ చేస్తున్నాయని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమం మూడు సంవత్సరాలుగా చేస్తున్నారు అంటే..వారి గుండెలు ఎంత మండి ఉండాలో అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ మీద 30,000 కుటుంబాలు ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి దోచుకుంటుంటే …. ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంతవరకు స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయటానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని హామీ ఇచ్చారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటి కరణ చేస్తే 30,000 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 20 మిలియన్ టన్నుల సామర్థ్యం తో విశాఖ ఉక్కు నడుస్తుందని అలాంటప్పుడు ప్రభుత్వాలు ప్లాంట్ మీద ఎంత శ్రద్ధ పెట్టాలని ప్రశ్నించారు. అతి త్వరలో రాహుల్ గాంధీ ని స్టీల్ ప్లాంట్ వద్దకు తీసుకువస్తానని ..రాబోయే ఎన్నికల మేనిఫెస్టో లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని చేరుస్తామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *