fbpx

ప్రభుత్వానికి వాలంటీర్లు అంబాసిడర్లుగా పని చేయాలి : కన్నబాబు

Share the content

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తూ అందరి మన్ననలు పొందుతు ఉత్తమ సేవలకు గాను అవార్డులు అందుకుంటున్నా వాలంటీర్లు అందరికీ జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా అభినందనలు తెలిపారు.గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుంచి గురువారం వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కింద ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేసే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు.

కాకినాడ కలెక్టరేట్ లోని వివేకానంద హల్ లో నిర్వహించిన వాలంటీర్లకు అభినందన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ…. జిల్లాలో 11,877 మంది వాలంటీర్లకు సేవా మిత్ర , సేవ రత్నా , సేవా వజ్ర అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. సేవా మిత్ర అవార్డు కింద 11,691 మందికి రూ.15 వేల చొప్పున నగదు, ప్రసంశ పత్రం, సాలువ, బ్యాడ్జి; సేవ రత్న కింద 152 మందికి రూ.30 వేల చొప్పున నగదు, ప్రసంశ పత్రం, సాలువ, బ్యాడ్జి, మెడల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సేవా వజ్ర క్రింద జిల్లాలో 34 మందికి రూ.45 వేలతో పాటు ప్రశంస పత్రం, సాలువ, బ్యాడ్జి, మెడల్ అందించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వాలంటీర్లు అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లను సన్మానించడం జరుగుతుందన్నారు. ఇదేవిధంగా వాలంటీర్లు అందరూ ఉత్తమ సేవలో అందించి ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలని ఆయన సూచించారు. వాలంటీర్లు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందించి ప్రజల మన్ననలను పొందుకుంటున్నారని ఆయన తెలిపారు. వాలంటీర్లు సేవలు రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి మిమ్ములను సన్మానించడం గొప్ప అదృష్టమని వాలంటీర్లకు భవిష్యత్తులో మంచి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో రామ్ గోపాల్, కాకినాడ, పెద్దాపురం డీఎల్డీవోలు పీ.నారాయణమూర్తి, కెఎస్ఎన్వీ. ప్రసాదరాజు, గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *