fbpx

ఎన్నికల బందోబస్తుకు సిఎపిఎఫ్ బలగాలు : సిఎస్ జవహర్ రెడ్డి

Share the content

రాష్ట్రంలో త్వరలో జరగనున్నపార్లమెంట్,అసెంబ్లీ ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లకై ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి 465 కంపెనీల సిఎపిఎఫ్(సెంట్రల్ ఆర్మర్డ్ పోలీసు ఫోర్సెస్) బలగాలు అవసరమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీ నుండి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా వివిధ రాష్ట్రాల సిఎస్,డిజిపి,సిఇఓ,హోం సెక్రటరీలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటుకు 465 కంపెనీల సిఏపిఎఫ్ బలగాలు,58 కంపెనీల ఎస్ఏపి(స్పెషల్ ఆర్మర్డ్ ఫోర్సెస్) బలగాలు అవసరం ఉందని వివరించారు.ఎస్ఏపికు సంబంధించి ప్రస్తుతం 32 బలగాలు మాత్రమే ఉన్నాయని కావున మరో 26 కంపెనీల ఎస్ఏపి బలగాలను పంపాలని హోం సెక్రటరీ ఎకె భల్లాకు సిఎస్ జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా, హోంశాఖ కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్త,అదనపు డిజిపి అతుల్ సింగ్,స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో డైరెక్టర్ యం.రవి ప్రకాశ్,డిఐజి సెంతిల్ కుమార్,హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ పాల్గొనారు.డిజిపి కెవి రాజేంద్రనాధ్ రెడ్డి వర్చువల్ గా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *