fbpx

ఫిబ్రవరి 1 నుంచి టెట్‌కు దరఖాస్తులు ప్రారంభం

Share the content

రాష్ట్రంలోని ఉపాధ్యాయ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. సుమారు 6 వేల పోస్టులను డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అలాగే ఈసారి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), డీఎస్సీని విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత టెట్‌ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టెట్‌కు ఫిబ్రవరి ఒకటి నుంచి ఇన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల సంఖ్య ఆధారంగా పరీక్షల షెడ్యూల్‌ నిర్ణయిస్తామని సర్కార్ పేర్కొంది. దరఖాస్తులు భారీగా వస్తే పరీక్షల నిర్వహణరే 15 రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత 10-15 రోజులు అటు ఇటుగా డీఎస్సీకి కూడా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు డీఎస్సీలో 6 వేల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపగా.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి టెట్‌, డీఎస్సీకి ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. అనంతరం షెడ్యూల్‌ ప్రకటిస్తారు. తొలుత టెట్‌ నిర్వహించి, ఫలితాలు ఇచ్చిన తర్వాత డీఎస్సీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుందనే సంగతి తెలిసిందే. టెట్‌, డీఎస్సీ పరీక్షలను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు.

నేటి నుంచి ఏపీ జూనియర్‌ లెక్చరర్ పోస్టులు కు దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ బుధవారం (జనవరి 31) నుంచి ప్రారంభం అవుతుంది. గత ఏడాది డిసెంబరు నెలాఖరున జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌లోని పోస్టులకు సంబంధించిన రోస్టర్‌ పాయింట్లు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందు పరిచినట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 20వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *