fbpx

వైసిపి రైతు కంఠక పాలనను ఇంటికి పంపుదాం : పురంధేశ్వరి

Share the content

దేశ ప్రధాని నరేంద్ర మోడీ బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు వేస్తుంటే….జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ఆ ఖాతాలో నుంచి డబ్బులు తిరిగి తీసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి విమర్శించారు. ప్రోవిడెంట్ ఫండ్, ఉపాధి హామీ ,ఈఎస్ఐ, పంచాయతీ నిధులు అన్ని కూడా బటన్ నొక్కి తిరిగి తీసుకున్నారని మండిపడ్డారు. మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా రైతు గర్జన సభ విజయవాడ వెన్యూ ఫంక్షన్ హాలు లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల వలన రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి కుంటుపడింది అని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు భరోసా దళారీ భరోసా అయ్యింది అని ఎద్దేవా చేశారు.ఉపాధి హామీ నిధులతో జేబులు నింపుకోవడంలో ఉన్న శ్రద్ధ.. పూడికలు తీయటంలో లేదా అని ప్రశ్నించారు.అన్నమయ్య డ్యాం గేట్లు కొట్టుకుపోయి ఇల్లు ఊళ్లు కొట్టుకుపోతే ఇంతవరకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి పారుదల మీద ఏ రకమైన శ్రద్ధ చూపిస్తున్నారు అని ప్రశ్నించారు.రైతు విత్తనం నాటిన దగ్గరి నుంచి,మార్కెట్ లో అమ్మే వరకు ప్రతి రైతుని చేయి పట్టుకొని నడిపిస్తాను అని జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాట నేడు ఏమైంది అని ప్రశ్నించారు.

రైతు ఆత్మహత్యల్లో దేశంలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. 98.3 శాతం రైతు కుటుంబాలు అప్పుల్లో ఉబిలో కూరుకుపోయాయి అని ఆందోళన వ్యక్తం చేశారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. సగటున ప్రతి రైతు కుటుంబం మీద 2.5 లక్షల అప్పు భారం ఉంది అని వెల్లడించారు.
రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ ఈ నివేదికలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.హార్టికల్చర్ లో 6.3 శాతం, ఆక్వా రంగంలో 19 శాతం తగ్గింది అని మండిపడ్డారు.ఈ స్థాయిలో వ్యవసాయ రంగంలో ఉత్పాదకత తగ్గి నైరాశ్యంలో కూరుకుపోతుంటే .. ఏ విధంగా రైతు పక్షపాతి ప్రభుత్వం అవుతుంది అని ప్రశ్నించారు.

ఖురాన్ , భగవద్గీత, బైబిల్ ను అవమానించలేదా ?

ఎన్నికల మేనిఫెస్టో ను ఖురాన్.. భగవద్గీత.బైబిల్ లా భావిస్తాము అని చెప్పిన జగన్ ఇప్పుడు వాటిని అవమానించలేదా అని ప్రశ్నించారు. ప్రతి జిల్లాలో కోల్డ్ స్తోరజి ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.. ఎన్ని జిల్లా ల్లో కోల్డ్ స్టోరేజ్ లు నిర్మించారో రైతులకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి అన్నారు.ఎన్నివేల కోట్లు వెచ్చించారో చెప్పాలని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు 4000 కోట్లతో ప్రత్యేక నిధి అన్నారు. మిచకుంగ్ తుఫాన్ సమయంలో రైతుల దగ్గరి నుండి తడిసిపోయిన ధాన్యాన్ని కూడా కొనలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ..ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోకటి ఉంటుందా అని ప్రశ్నించారు.వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకురావడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం 6.5 లక్ష ల కోట్లు వ్యవసాయ రంగం మీద వెచ్చించింది అని వెల్లడించారు. రైతులు సంఘటితం కావలసిన సమయం ఆసన్నమైంది అని అన్నారు.రైతు కంటక పాలనను తొలగించి ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *