fbpx

వైసీపీ ఇంకో కొత్త పథకం!

Share the content

ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో వైసిపి ప్రభుత్వం మరో కొత్త సంక్షేమ పథకానికి ఆమోద ముద్ర వేసింది. ఇప్పటికే సవాలక్ష సంక్షేమ కార్యక్రమాలతో పాలన సాగిస్తున్న వైసీపీ సరికొత్తగా సివిల్ అభ్యర్థులకు నజరానాలు ప్రకటించింది. జగనన్న సివిల్స్ లక్ష్యం పథకం ద్వారా సివిల్స్ ప్రిలిమినరీ పాస్ అయిన వారికి 50,000 పారితోషకం అలాగే మెయిన్స్ పూర్తి చేసిన వారికి లక్ష రూపాయలు పారితోషకం ఇస్తామంటూ చెప్పింది. పూర్తిగా డబ్బు ద్వారా మాత్రమే సివిల్ అభ్యర్థులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసం అనేది వైసిపి నేతలకే అర్థం కాని పరిస్థితి.

** సివిల్స్ లక్ష్యం ఉన్న అభ్యర్థులు కచ్చితంగా కోచింగ్ తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. డిగ్రీ పూర్తయిన తర్వాత వారు మంచి కోచింగ్ సెంటర్స్ ను ఎంచుకొని మరి ఏళ్ల తరబడి అక్కడ సాధన చేస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం మంచి కోచింగ్ సెంటర్లను నెలకొల్పాల్సింది పోయి పూర్తిగా అభ్యర్థులకు డబ్బులు ఇవ్వడం ఎంత మాత్రం సరికాదు అన్నది నిపుణుల మాట. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము వారికి దేనికి సరిపడదు అన్నది కూడా వారు చెప్పే మాట. సివిల్స్ కోచింగ్ కు ఏడాదికి సుమారు 7 నుంచి 10 లక్షలు ఖర్చు అవుతుంది. అది కూడా చాలా సాధారణంగా ఉండి బాగా చదువుకుంటే వారు కచ్చితంగా లక్ష్యం చేరుకోగలుగుతారు. సివిల్స్ లో ప్రతి మనిషికి నాలుగు అటమ్స్ ఉంటాయి. ఆ నాలుగుసార్లు కనుక సివిల్స్ లక్ష్యం అనుకున్నట్లు సాగకపోతే కచ్చితంగా వారు మరోసారి పరీక్ష రాయడానికి కూడా అనుమతించరు. ప్రభుత్వం సివిల్స్ ప్రిలిమినరీ పాస్ అయితే ఇచ్చే 50,000 ఎందుకు ఇస్తుంది అన్నది మాత్రం స్పష్టత లేదు. ప్రోత్సాహకం అని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ 50 వేలు ప్రోత్సాహకం వల్ల సివిల్ అభ్యర్థులకు ఒరిగేది కూడా ఏమీ ఉండదు. డబ్బులు ఇచ్చే బదులు అత్యున్నత కోచింగ్ కేంద్రాలను ప్రభుత్వమే నెలకొల్పితే ఖచ్చితంగా ఇదో పథకం అయ్యేది అన్నది బ్యూరోక్రాట్ల మాట. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడి పెట్టడం వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని కచ్చితంగా అందరి మన్ననలు పొందాలంటే భవిష్యత్తు తరాలకు కూడా దిక్సూచిగా ఉండే కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకురావాలి అని సివిల్స్ అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *