fbpx

చంద్రబాబుకు మళ్ళీ ఎదురు దెబ్బ..

Share the content

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆర్ధిక నేరానికి పాల్పడ్డారంటూ టిడిపి జాతి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను. ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు వయస్సు రిత్యా తాను జైల్లో ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని హౌస్ కస్టోడియల్ కు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టులో వేసిన పిటిషన్ ను నేడు ఏసీబీ కోర్టు కొట్టేసింది. దీంతో టీడీపీ శ్రేణులలో తీవ్ర నిరాశ ఛాయలు అలముకున్నాయి. దీంతో హైకోర్టులో చంద్రబాబు హౌస్ కస్టోడియల్ పై పిటిషన్ దాఖలు చేసేందుకు టిడిపి తరఫున న్యాయవాది సిద్ధార్థ లూద్ర పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో పక్క చంద్రబాబు నాయుడు ను విచారణ చేసేందుకు సిబిఐ కోర్టును పర్మిషన్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో మరొకసారి రేపటి కోర్టు పైన టిడిపి శ్రేణుల్లో ఉత్కంఠత నెలకొంది.

మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ను పరామర్శించేందుకు ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు నారా లోకేష్ కోడలు బ్రాహ్మణి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు . అనంతరం నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమే ఆయన జీవితాన్ని ధారబోసారని, తన కుటుంబం కోసం నిలదీసిన తనకు ముందు ప్రజలే ముఖ్యమని ఆ తర్వాతే కుటుంబమని ఆయన అనే వారిని ఆమె తెలియజేశారు. అలాంటి మనిషిని ఆయన నిర్మించిన జైల్లోనే కట్టిపడేసారంటూ బరువెక్కిన హృదయంతో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా శ్రేయస్సు కోసం పోరాడి.. ఏమీ లేని కేసులో ఇరుక్కున్న వ్యక్తి కోసం ఆయనకు అండగా నిలిచి బయటకు వచ్చి పోరాటం చేయాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ఆయనను చూసి బయటకు వచ్చే సమయంలో నా సగభాగాన్ని లోపల వదిలి వచ్చినట్లు ఉందని భువనేశ్వరి బాదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఎన్టీఆర్ నిర్మించిన పార్టీ ఎప్పటికీ టిడిపి క్యాడర్ ప్రజల ఆశీస్సులతో అలానే ఉంటుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *