fbpx

కరువు పై కప్పగంతులు

Share the content

అక్టోబర్ 31వ తేదీ అర్ధరాత్రి… సరిగ్గా 12:00 దాటిన తర్వాత కరువు మండలాలపై వైసీపీ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అత్యంత రహస్యంగా రాష్ట్రంలో 13 మండలాల్లో కరువు ఉన్నట్లు ప్రకటించింది. అంత రహస్యంగా కరువు మండలాలను ప్రకటించడం బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే ప్రథమం కావచ్చు. రాష్ట్రంలో లోటు వర్షపాతం వల్ల రైతంగం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటే దానిని దాచి పెట్టేందుకు వైసీపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. దీనికి మూల కారణం ఏమిటి అని గమనిస్తే గతంలో జగన్ చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు వస్తే మొత్తం వర్షాలు ఆగిపోయి కరువు వస్తుంది అని గతంలో జగన్ పదేపదే ఏద్దేవా చేసిన మాటలు.. ఇప్పుడు ఆయనకు మాత్రమే గుచ్చుకోవడం ఆయన తట్టుకోలేకపోతున్నారు.

** జగన్ మానసిక తత్వం ప్రకారం ఆయన విమర్శను తట్టుకోలేరు. అలాగే రాజకీయ శత్రువులపై చేసిన విమర్శలు తన వరకు వస్తే అసలు తట్టుకోలేరు. ఇప్పుడు కరువు విషయంలో కూడా రాష్ట్రంలో సుమారు 360 మండలాలు కరువులో ఉంటే కేవలం 103 కేంద్రాలు మాత్రమే కరువులో ఉన్నట్లు చెప్పడం ద్వారా రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పడానికి వైసిపి ప్రభుత్వం తెగ ప్రయత్నం చేస్తోంది. చాలాచోట్ల వర్షాభావం ఫలితంగా చాలా సమస్యలు వస్తుంటే దానిని దాచి పెట్టేందుకు రాష్ట్రంలో అంతా బాగుంది అని చెప్పేందుకు వైసిపి తెగ మదన పడుతుంది. రైతులను ఆదుకోవాల్సిన వైసీపీ సర్కారు దానిని పూర్తిగా పక్కన పెట్టి కొత్త కొత్త రకాలు ఎత్తులు వేస్తోంది. అంతేకాదు కరువు మండలాలను పేర్లు కూడా బయటకు చెప్పకుండా.. ఎలాంటి సహాయం అందిస్తారో కూడా బయట పెట్టకుండా అంత గుమ్మనంగా పాలన సాగిస్తోంది. ఒకప్పుడు చంద్రబాబును కరువు అన్న జగన్ తన పాలనలో సైతం కరువు ఎదురవడంతో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కొట్టు మిట్టడుతున్నాడు. ఫలితంగా రాష్ట్ర రైతాంగం పూర్తిస్థాయిలో వైసిపి పాలన మీద అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కరువు మండలాల్లో రైతులకు కచ్చితంగా తగిన సహాయం అందించి వారికి వివిధ రకాల రాయితీలు అందించాల్సిన ప్రభుత్వం.. కరువు మండలాలు లెక్క చెప్పడంలోనే చేస్తున్న తప్పిదాలతో ఇప్పుడు అంత అస్తవ్యస్తంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *