fbpx

అక్క చెల్లెమ్మల్లను వీధుల్లోకి తీసుకువస్తారా?

Share the content

అంగన్వాడిల సమ్మెను వాయుధా వేయటం,విచ్ఛిన్నం చేయటం తప్పితే సమస్యను పరిష్కరించాలనే సద్బుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు.మంగళవారం విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావటానికి ముందు చేసిన వాగ్దానం ప్రకారం తెలంగాణలో కంటే అదనంగా రూ.1,000 రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడిల జీతాలను పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గెస్ట్ హౌజ్ కొరకు 450 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం .. లక్ష మంది అంగన్వాడిలకు మూడు వేల రూపాయలను జీతం పెంచితే సంవత్సరానికి 300 కోట్ల మాత్రమే అవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే అంగన్వాడిలను వీధుల్లోకి నెట్టి కడుపు మాడుస్తుందని ధ్వజమెత్తారు.గత ప్రభుత్వంలో అంగన్వాడి లు చేసిన ఆందోళనకు మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి నేడు అదే ఆందోళనను అణచియడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడిల కేంద్రాలు ను తెరిపంచడానికి అడ్డమైన దారులు తొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడి లు మీద బొబ్బిలి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఖండించకపోవటం బాధాకరమని తెలిపారు.గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ 1,50000 మేర లబ్ధి పొందారు అని చెప్తున్న ప్రభుత్వం.. అంగన్వాడిలు పడుతున్న కష్టానికి సంవత్సరానికి కేవలం రూ. 1,30,000 ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని తెలిపారు.

సంక్షేమ పథకాల్లో కోత
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడిలకు ప్రభుత్వ ఉద్యోగం లెక్కలు చూపించి సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగికి ఇచ్చే సౌకర్యం మాత్రం ఇవ్వరు అని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి ఐన కళ్లు తెరిచి, భేషజాలకు పోకుండా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అని డిమాండ్ చేశారు. అంగన్వాడి లను వెంటనే చర్చలకు పిలిచి వాగ్దానాన్ని నిరూపించుకోవాలి అని అన్నారు. సమ్మె చేస్తున్న వారికి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. డిమాండ్లను ఆమోదించి సమ్మెను విరమింపచేయడం ప్రభుత్వ బాధ్యతని గుర్తు చేశారు.

  • విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రవేటికరించెందుకు రహస్యంగా అమలుకు ఒకొక్క అడుగు వేస్తూ కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 25 మంది ఎంపిలు విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా పార్లమెంట్ లో గలమెత్తాలని డిమాండ్ చేశారు. టిడిపి,వైసిపి రెండు కూడా బిజెపి వెంటనే ఉన్నాయని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును రక్షించకుండా పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయకుండా పార్లమెంట్లో ఉండి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *