fbpx

సుప్రీం తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలి

Share the content

రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె పిలుపులో భాగంగా స్థానిక వేంపల్లి ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైటాయించారు.అంగన్వాడీల డిమాండ్లకై ప్రభుత్వంతో చర్చలు సోమవారం విఫలం అయిన నేపథ్యంలో నేటి నుంచి మూకుమ్మడిగా సమ్మెబాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటియుసి,సిఐటియు అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ల ఆధ్వర్యంలో వెంపల్లి ఐసిడిఎస్ కార్యాలయం ఎదురుగా బైఠాయించి నిరవధిక సమ్మె నిర్వహించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కేసి. బాదుల్లా, యూనియన్ నాయకురాలు సరస్వతి,ప్రభావతి,లలితమ్మ,సావిత్రిలు మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలకు కనీస వేతనం26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పొరుగు రాష్ట్రం తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు వేతనం ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.మినీ సెంటర్ లను మెయిన్ సెంటర్లు గా మార్చి, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలనీ కోరారు.ఐసిడిఎస్ కు బడ్జెట్స్ యందు నిధులు పెంచి, ఫ్రీ స్కూల్ లను బలోపేతం చేయాలని తెలిపారు.అర్హులైన హెల్పర్ల కు ప్రమోషన్ల నిబంధనలను రూపొందించి, ప్రమోషన్ల వయసు 50 సంవత్సరాలు పెంచాలన్నారు.వైయస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని,గ్యాస్ సరఫరా ను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని పేర్కొన్నారు. మూడు యాప్లను రద్దు చేసి ఒకే యాప్ ద్వారా విధులు నిర్వహించే విధంగా చేయాలని పెకొన్నరు.పెండింగ్ లో ఉన్న 2017 టీఏ,డీఏ ఇతర బకాయిల బిల్లులను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు శైలజ, శాంతకుమారి,శ్యామల, లక్ష్మి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *