fbpx

అనుకున్నదొకటి అయ్యింది ఒకటి

Share the content

తెలుగుదేశం పార్టీ ఒకటి ఆలోచిస్తుంటే బీజేపీ మరొకటి ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. వచ్చే తెలంగాణ ఎన్నికల లక్ష్యంగా బిజెపి ఎత్తులు వేస్తోంది. గెలిచేందుకు ఉన్న అన్ని దారులను వెతుకుతోంది. దీనిలో భాగంగా తెలంగాణలో కాస్తో కోస్తూ ప్రభావం చూపే తెలుగుదేశం పార్టీని కూడా తమ వైపు తిప్పుకోవాలని బీజేపీ బలంగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల గెలుపే లక్ష్యంగా బిజెపి పెద్దలు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో ఢిల్లీలో భేటీ అయినట్లు సమాచారం వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తుల మీద మాట్లాడుతారని తెలుగుదేశం పార్టీ భావిస్తే దానికి భిన్నంగా తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరిని తెలుసుకునేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అయిన చంద్రబాబు లోపల ఏం జరిగింది అనేది మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదు.

ఒక శాతం కూడా అవసరమే

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అడపాదడపా ప్రభావం చూపే అవకాశం ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో బలమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి లేకపోయినప్పటికీ ఆంధ్ర ప్రజలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులు ఎక్కువ. గతంలోనూ ఇక్కడే తెలుగుదేశం పార్టీకి మంచి ఓట్ల శాతం లభించింది. దీంతోపాటు హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులు ఉన్నారు. వారి ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలంగాణలో బాగా వేయాలని ప్రయత్నిస్తున్న కమలనాధులు తెలుగుదేశం పార్టీ మద్దతును కోరుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల్లో ఎలాగో పోటీ చేయు కాబట్టి ఆ పార్టీ మద్దతును కూడగట్టి కచ్చితంగా ఉన్న ఒకటి అర ఓట్ల శాతం కూడా తమ వైపు తిప్పుకోవాలి అని భావిస్తున్నారు. ఈ విషయం మీదనే ఢిల్లీ పెద్దలు ప్రధానంగా చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పొత్తుల విషయం దాదాపుగా చర్చకు రాలేదని కేవలం తెలంగాణ ఎన్నికల తర్వాతనే బిజెపి ప్రధాన దృష్టి ఆంధ్ర ఎన్నికలపై ఉండే అవకాశం ఉందని సమాచారం. దక్షిణాదిన వచ్చే తెలంగాణ ఎన్నికలను బిజెపి పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దక్షిణాదిలో ఇప్పటివరకు తమ చేతిలో ఉన్న కర్ణాటకను పోగొట్టుకున్న బిజెపి కచ్చితంగా తమ ప్రభావం దక్షిణాదిలో చూపించాలంటే తెలంగాణలో గెలిచి తీరాలని కృతనిచయంతో ఉంది. దీనికి కావలసిన అన్ని మార్గాలను బిజెపి పెద్దలు వెతుకుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *