fbpx

ఆ రెండు కులాల మధ్య గొడవ పెట్టడానికి రాంబాబు సిద్ధం

Share the content

కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య వైరం ఎలాగైనా రగిలించేందుకు వైసిపి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో ప్రధానంగా మంత్రి అంబటి రాంబాబు కీలకంగా వ్యవహరిస్తున్నారు అన్న సంకేతాలు క్లియర్ గా వస్తున్నాయి. వైసీపీ అధినాయకత్వం ఈ పనిని అంబటి రాంబాబుకు అప్పగించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు తర్వాత కచ్చితంగా ఆయా సామాజిక వర్గాల మధ్య ఎలాగైనా చిచ్చు రగిలించడం ద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆ ఈ రెండు సామాజిక వర్గాల నైతికత మధ్య చిచ్చురేపి దాని ద్వారా లబ్ధి పొందాలని వైసిపి భావిస్తోంది. దీనికి సరైన వ్యక్తిగా సీనియర్ నేత అంబటి రాంబాబును వైసిపి ఉపయోగించుకున్నట్లు కనిపిస్తోంది.

** గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మంత్రి అంబటి రాంబాబు తన సొంత కులం అయిన కాపు కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. కాపులు అంటే కేవలం పని పాట లేని వ్యక్తులుగా అలాగే… మద్యానికి బానిసలుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కాపు యువతలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. అలాంటి అంబటి రాంబాబు ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి వెళ్లి వస్తుండగా మధ్యలో కొందరు యువకులు ఆయనను అడ్డగించి దాడి చేయడానికి ప్రయత్నించడాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా కులంతో ముడి పెట్టడం ఇప్పుడు అందరిలో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. ముఖ్యంగా తనపై దాడి చేసిన వారు కమ్మ కులానికి చెందిన వారిగా అంబటి రాంబాబు చెప్పుకోవడం … ఆ వెంటనే తనకు ఒక కులం ఉందని ఆ కులం వాళ్ళు చూస్తూ ఊరుకోరంటూ చెప్పడం ద్వారా కమ్మ కాపు మధ్య మరోసారి వైరం పెట్టడానికి అంబటి రాంబాబు ప్రయత్నించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. దీంతో అంబటి రాంబాబు చర్యలను కాపు యువత మరోసారి ఖండిస్తున్నారు. అంబటి రాంబాబుకు ఇప్పుడు కులం గుర్తొచ్చిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా అంబటి రాంబాబు హీరో నందమూరి బాలకృష్ణను ఉద్దేశిస్తూ పలు రకాలుగా శాసనసభలో వ్యాఖ్యలు చేయడం అటువైపు నుంచి బాలకృష్ణ కూడా ప్రతిస్పందించడంతో ఆ గొడవ రెండు సామాజిక వర్గాల మధ్య పెద్దదిగా చేద్దామని చాలా ప్రయత్నాలు జరిగాయి. కావాలనే కమ్మ సామాజిక వర్గం వారు ఇలా రెచ్చగొడుతున్నారు అంటూ అప్పట్లో అంబటి రాంబాబు వ్యాఖ్యానించడం… రెండు కులాల మధ్య ఎలాగైనా చిచ్చురేపాలి అనే వైసిపి మైండ్ గేమ్ లో భాగం అని అర్థమైంది. అప్పట్లో శాసనసభ వేదికగా జరిగిన ఈ రభస మెల్లగా సర్దుమనిగింది మళ్ళీ ఇప్పుడు తాజాగా జరిగిన గొడవను సైతం ఆయన సామాజిక వర్గాల గొడవగా పెట్టాలని చూస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కచ్చితంగా కమ్మ కాపు మధ్య ఎలాగైనా చిచ్చురేపాలి అని… రకరకాల ప్రయత్నాలు జరుగుతాయి. ఈ రెండు సామాజిక వర్గాలకు ఎప్పుడు ఉప్పు నిప్పు అనే భేద భావం నేపథ్యంలో ఖచ్చితంగా దానిని ఎలాగైనా రేపి ప్రయోజనం పొందాలని వైసీపీ కాచుకు కూర్చుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *