fbpx

జగన్ సర్కారుకు “మధ్యే” మార్గం

Share the content

వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో దెబ్బతీసేది ఏదైనా ఉందంటే సంపూర్ణ మద్య పాన నిషేధం హామీ మాత్రమే. అధికారంలోకి వస్తే దశలవారీగా పూర్తిస్థాయి మద్యపానం నిషేధాన్ని అమలు చేస్తామని ఐదు ఏడు నక్షత్రాల హోటల్లో మాత్రమే మద్యం అమ్మేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ముందు ప్రతి సభలోను జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని కనీసం అమలు చేయలేక మద్యపానం అమ్మకాల్లో గతంలో ఎన్నడూ లేనట్లుగా రికార్డు సృష్టించింది జగన్ సర్కారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే లక్ష కోట్లు మద్యం అమ్మకాలు ఉండేవి కాదు. అలాంటిది జగన్ నాలుగున్నర సంవత్సరాలలోనే లక్ష్య పదివేల కోట్ల వరకు మద్యం అమ్మకాలు చేయడం ఓ పెద్ద రికార్డు. దీనిని ప్రతిపక్షాలు బలంగా జనంలోకి తీసుకువెళ్లాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల ఓట్లతో ముడిపడి ఉన్న మద్యపాన నిషేధం హామీని పూర్తిస్థాయిలో జగన్ సర్కారు తుంగలో తొక్కిందని ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పటికే వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ సైతం ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. జగన్ సర్కారు తీసుకువచ్చిన మద్యం అంత కల్తీమయం అని, ఆడపిల్లల పసుపు కుంకుమలతో జగన్ ఆటలాడుకుంటున్నారని పవన్ కళ్యాణ్ ప్రముఖంగా ప్రచారం చేయడం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కారు మీద ఇది కచ్చితంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

ఎలా ఎదుర్కోవాలి

మద్యపాన నిషేధం హామీ విషయంలో ప్రతిపక్షాల విమర్శలను బలంగా ఎదుర్కొనేందుకు జగన్ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలను బలంగా అమలు చేయడంలో మద్యపానం అమ్మకాలు విలువ అధికం. మద్యపానం వల్ల వచ్చిన రెవిన్యూను సంపూర్ణ సంక్షేమ పథకాలకు జగన్ సర్కారు మళ్ళించింది. మద్యపాన నిషేధం చేస్తే కనుక ఒక్క హామీని కూడా జగన్ అమలు చేసి ఉండేవారు కాదు. ఇదే విషయాన్ని ప్రజలకు ఏ విధంగా చెప్పాలి అనే విషయాన్ని జగన్ ఐప్యాడ్ టీం వ్యవహారచన చేస్తోంది. ఇప్పటికే హామీల్లో 99 శాతం హామీలను అమలు చేశామని చెబుతున్న జగన్ ప్రభుత్వం ఆ ఒక్క హామీని అమలు చేయలేకపోయామని దానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటు కూడా కారణం అని చూపుతూ ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను పూర్తిస్థాయిలో అప్పుల్లో ముంచి రెవెన్యూ లోటును ఇచ్చి వెళ్లిపోయిందని దీంతోనే మద్యపాన నిషేధాన్ని అమలు చేయలేకపోయామని జగన్ సర్కారు ప్రజలకు చెప్పుకునేందుకు ఇప్పటికే ఆన్లైన్ వేదికగా పూర్తిస్థాయి ప్రచార హోరును మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇది ప్రజల్లోకి ఎంత వెళ్తుంది మహిళలు జగన్ చెప్పే మాటను ఏమేర నమ్ముతారు అనేది కాలమే నిర్ణయిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *