fbpx

చంద్రబాబు కు ప్రతికూల పరిస్థితులు

Share the content

చంద్రబాబు నాయుడు క్వాష్ పొజిషన్ విషయంలో ఎక్కువగా సెక్షన్ 17 (a) మీద ఎక్కువగా వాదనలు జరిగినట్లు వస్తున్న వార్తలు ఆధారంగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు తరఫున ప్రముఖ లాయర్ హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తే సిఐడి తరఫున మరో ప్రముఖ లాయర్ ముకుల్ రోహిద్గి వాదనలు వినిపించడంతో సుప్రీంకోర్టులో ఏం జరుగుతుంది అన్న అంశం మీద దేశంలోని న్యాయ వ్యవస్థలో కీలకంగా పని చేసే అందరి దృష్టిపడింది. ఇద్దరూ భారత దేశంలో ప్రముఖ లాయర్లు కావడంతో పాటు మాజీ ముఖ్యమంత్రి మీద నేటి ముఖ్యమంత్రి వేసిన కేసుగా జాతీయస్థాయిలో దీనిపై అందరి ఆసక్తి నెలకొంది. క్వాష్ పిటిషన్ అంటేనే పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, తప్పుడు ఆరోపణలతో కేసులు నమోదు చేసిన పోలీసుల తీరు మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కిందికి వస్తుంది. అంటే అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పుకు పాల్పడలేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. క్వాష్ పిటిషన్ను కిందిస్థాయి ఏసీబీ కోర్టు ఎప్పుడో కొట్టివేస్తే రాష్ట్ర హైకోర్టు కూడా చంద్రబాబు పిటిషన్ను తోసిపుచ్చింది. దీంతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం కోసం వెళ్లిన చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎలాంటి తప్పు జరగలేదని చంద్రబాబు అసలు ఏ నేరం చేయలేదు అని నిరూపించుకోవాల్సి ఉంది. సోమవారం సుప్రీంకోర్టు మొదలైన వెంటనే చంద్రబాబు పిటిషన్ మీద వాదనలు మొదలుపెట్టిన న్యాయవాదులు… సీఆర్పీసీ లోని 17 ఏ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. సెక్షన్ 17 ఏ ప్రకారం చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో ఎప్పుడు నేరం జరిగింది ఇప్పుడున్న ప్రభుత్వం నేరం ఎప్పుడు బయటపెట్టింది అనే దానిమీద, దీంతోపాటు కేసులో ఇన్వాల్వ్ అయిన సాక్షులు అలాగే ఇతర కీలక ఆధారాలు ఎప్పుడు సేకరించింది అన్నదానిమీద నిరూపించుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు అధికారంలో ఉండగా ఇది జరిగింది అని తర్వాత దీనిని అన్ని ఆధారాలతో బయట పెట్టాము అని సి ఐ డి తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలిపితే, చంద్రబాబు తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం సెక్షన్ 17 ఏ కు వ్యతిరేకంగా ప్రభుత్వ తీరు ఉందని, కచ్చితంగా దీనిని మినహాయించి వెంటనే చంద్రబాబుకు ఈ స్కామ్ తో ఏమాత్రం సంబంధం లేదని చెప్పాలని వాదించారు. దీంతో ఈ కేసులో మొత్తం వాదనలు విన్న న్యాయమూర్తులు సైతం పూర్తిస్థాయిలో దీనిమీద న్యాయ సలహా నిమిత్తం అలాగే తుది నిర్ణయం నిమిత్తం కోర్టును వాయిదా వేశారు.

సుప్రీంకోర్టులో వాదనలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తే చంద్రబాబుకు ప్రతికూలంగానే తీర్పు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనుక బయటకు వచ్చినప్పటికీ మరో మూడు కేసులను ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టింది. దీంతో ఆయన ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం కనిపించడం లేదు కానీ ప్రతి కేసు మీద క్వాష్ పిటిషన్ దాఖలు చేయాలని మాత్రం తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయిలో ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా బయటకు వస్తే కచ్చితంగా ఇది జగన్కు వచ్చే ఎన్నికల్లో ప్రతికూలంగా మారుతుంది అని తెలుగుదేశం భావిస్తోంది. అయితే ప్రస్తుత పరిణామాలు తెలుగుదేశం పార్టీ ప్రణాళిక ప్రకారం జరుగుతున్నట్లు ఏమీ కనిపించడం లేదు. దీంతో ఏం చేయాలన్న దానిపై ఎప్పటికప్పుడు చంద్రబాబు దిశ నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ ములకత్ కు వెళ్లిన సారీ కచ్చితంగా రాజకీయాలతో పాటు న్యాయ పరంగా కూడా ఎలా పోరాడాలి అనే అంశం మీద ఎవరిని కలవాలి అనే విషయాలు మీద ఆయన జైలు నుంచే లోకేష్ కు సరైన దారి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వరకు కనుక చంద్రబాబు బయటకు రాకపోతే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి అన్న దానిమీద కూడా ఇంకా స్పష్టత రాలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *