fbpx

తుస్సుమన్న జగన్ సభ.

Share the content

జగన్ ఏదో చెబుతారు అనుకుంటే ఇంకేదో చెప్పి సభ ముగించారు.. ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే అత్యవసరంగా ఏర్పాటు చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు అలాగే ముఖ్య నాయకులు సభలో జగన్ తుస్ మనిపించారు. వైసిపి ఎన్నికల ముందు చేయబోయే కార్యక్రమాలను ఒక్కొక్కటిగా చెబుతూ కార్యకర్తల్లో నిరాశ నిస్పృహలు నింపారు. ముఖ్యంగా పింఛను జనవరి ఒకటో తేదీ నుంచి పెంచుతామని చెప్పడం ద్వారా వైసిపి వృద్ధులకు ఇచ్చిన మాటను పూర్తిస్థాయిలో నిలబెట్టుకుంది అని చెప్పాలని భావిస్తున్నారు. దీంతోపాటు ఆయన మరో నాలుగు కార్యక్రమాలను ప్రకటించారు. అయితే అవేవీ కొత్తగా లేకపోవడంతో పాటు.. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ చెప్పాల్సిన అంశాలుగా కూడా కనిపించలేదు.

ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కేంద్ర పెద్దలను కలిసి అక్కడ జరిగిన రాజకీయ పరిణామాలపై అలాగే వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అన్నదానిపైన శ్రేణులకు జగన్ దిశనిర్దేశం చేస్తారని కొత్త కార్యక్రమాలను మొదలు పెడతారని ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందని సగటు వైసిపి నేతలు కార్యకర్తలు భావించారు. అయితే జగన్ మాత్రం దానికి భిన్నంగా సాధారణ స్థాయిలోనే.. బహిరంగ సభలో మాట్లాడిన విధంగానే కేవలంతో మంత్రంగా పార్టీ కార్యక్రమం చేశారు. ఇప్పటికే గడపగడపకు కార్యక్రమంలో ఉన్న వైసీపీ నేతలు కొత్తగా జగన్ ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు అవసరం అనే కొత్త కార్యక్రమం ద్వారా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు అని చెబుతున్నారు. గడపగడపకు ఇప్పుడు వెళుతున్న క్రమంలోనే.. ఆ కార్యక్రమం కూడా ఉంటుంది అని భావిస్తున్నారు. కొత్త సంవత్సరంలో జనవరి ఒకటో తేదీ నుంచి వృద్ధులకు వైసీపీ చెప్పినట్లుగా 3000 ఫించను పెంచే కార్యక్రమం 10 రోజులపాటు ఘనంగా చేయాలని జగన్ ఆదేశించారు. దీంతోపాటు చేదోడు ఆసరా పథకాలను కూడా జనవరిలో చేయబోతున్నారు. ఇక ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం జగన్ చెప్పే అంత పెద్ద కార్యక్రమం ఏమీ కాదు. ఇప్పటికే సీఎం కప్ అంటూ తూతూ మంత్రంగా ఆటలను నిర్వహించి మైదానాలను పూర్తిగా నాశనం చేసిన తీరు జనాల్ని బాధపెడుతున్న సమయంలో ఆడుదాం ఆంధ్ర అంటూ ఇప్పుడు కొత్తగా ఆటల ద్వారా ప్రజలకు చెప్పేది ఏమీ ఉండదని వైసిపి నాయకులు భావిస్తున్నారు. మార్చి నుంచి తీరికగా జగన్ ప్రజల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. యధావిధిగా ఏప్రిల్ లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగితే మార్చిలో జగన్ జనాల్లోకి వస్తే అన్ని ప్రాంతాలను కవర్ చేయగలరా.. ఒకవేళ చేసిన ఆయన ప్రసంగంలో ఏమైనా మార్పు కనిపిస్తుందా..? అనేది కూడా సందేహస్పదమే. ఏప్రిల్ మధ్యలో ఎన్నికల పడితే మార్చి మొదట్లో కనుక జగన్ బయటకు వస్తే.. పూర్తిస్థాయిలో పర్యటనలు రాజ్యమవుతాయా లేదా అనేది వైసిపి నేతలకు అయోమయానికి గురిచేస్తుంది. అసలు ఢిల్లీ నుంచి వచ్చిన జగన్ ఏదైనా కొత్త విషయం పైన సభ పెడుతున్నారు అని భావించిన వైసీపీ నేతలు విజయవాడలో ఇటీవల నిర్వహించిన సభ దెబ్బకు పూర్తిగా నిరాశలోకి వెళ్లిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *