fbpx

బురదజల్లే ప్రయత్నం.

Share the content

ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వలసలు పెరుగుతున్నాయి. ఒక పార్టీ నుండి మరొక పార్టీకి వలస వస్తున్న నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కుల ప్రస్తావన తీసుకొచ్చిరాజకీయం చేస్తున్నారు. ఇటీవల నెల్లూరు జనసేన నేత కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి జనసేనలోని నెంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడని మండిపడ్డారు. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి తో పొత్తు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తనకు పూర్తిగా మనస్థాపానికి గురి చేసిందని చంద్రబాబు నాయుడు కి జనసేన నాయకులు ఊడిగం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కోస్తా లోని టిడిపి కమ్మ నాయకుల పల్లకిని కాపులు మోయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షూటింగ్ లకే పరిమితమై రాజకీయాలకు అప్పుడప్పుడు వీకెండ్ లో వచ్చి తన ప్రసంగం వినిపించి వెళ్లిపోతారని… నెంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ మాత్రం తనకు తాయిలాలు ఇచ్చే వారికే పార్టీలో ప్రథమ స్థానం కల్పిస్తారని అన్నారు. నా దాంట్లో మనోహర్ కారణంగానే తాను జనసేన నుండి బయటికి రావాల్సి వచ్చిందని తెలిపారు. తన నియోజకవర్గంలో తను ఇంటింటికి తిరిగినప్పుడు ప్రతి ఇంట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాలు ఉన్నాయని. అభివృద్ధి అంటే వైసీపీ తోనే సాధ్యమైన విషయం తెలుసుకొని పార్టీలో చేరానని తెలియజేశారు. అయితే జనసేన నాయకుల మాత్రం ఇది వైసీపీ వ్యూహమే అని అంటున్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో పార్టీ నాయకులను వైసీపీ లోకి లాక్కుంటారు అన్న విషయం ముందుగానే గ్రహించినట్లుగా జనసేన నాయకులు అంటున్నారు. వ్యూహాత్మకంగానే తమ సామాజిక వర్గానికి చెందిన కేతన్ రెడ్డిని మొదటిగా లాక్కున్నారని. జనసేనకు అత్యంత సన్నిహితంగా ఉండే కాపులలో అభద్రతాభావం ఏర్పరిచేందుకే కాపులు కమ్మవారికి ఉడిగం చేస్తున్నారంటూ కుల ప్రస్తావన తీసుకొచ్చేలా కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి వ్యాఖ్యలుచేసినట్లుగా అర్థమవుతుంది. చంద్రబాబును సీఎం చేసేందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊడిగం చేస్తున్నారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ఆ పార్టీలో ఉన్న నాయకులతోనే ఈ విషయాన్ని చెప్పించాలని వైసిపి పథకం రచించినట్లుగా పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసిపి ప్రభుత్వం ఎన్ని పథకాలు పన్నిన వచ్చే ఎన్నికల్లో జనసేన తన బలాన్ని చూపిస్తుంది అంటూ జనసేన వర్గాలుధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *