fbpx

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చట్ట విరుద్ధం : క్యాట్

Share the content

సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ క్యాట్ ( సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్) బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఏబి వెంకటేశ్వరారవును రెండోసారి సస్పెండ్ చేయడం న్యాయ విరుద్దమని క్యాట్ పేర్కొంది. సస్పెన్షన్ చట్ట విరుద్దమని, ఒకసారి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా రెండోసారి సస్పెండ్ చేయడం ఉద్యోగిని వేధించడమేనని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది.తక్షణమే సర్వీస్‌లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆయనకు రావాల్సిన ఎరియర్స్ మొత్తం ఇవ్వాలంటూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ ఆదేశాలు జారి చేసింది.రెండోసారి తనను సస్పెండ్ చేయడంపై ఆయన గతంలో క్యాట్ ను ఆశ్రయించారు. ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును క్యాట్ రిజర్వ్ చేసింది.నేడు తీర్పు వెలువరించింది. వైసీపీ అధికారం చేపట్టిన తరువాత నిఘా పరికరాల కాంట్రాక్ట్ అంశంపై ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతల నుంచి ఆయన్ను జగన్ సర్కార్ తప్పించింది. అనంతరం 9 నెలల పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. నిఘా పరికరాల వ్యవహారం, ఇజ్రాయెల్‌కు రహస్యాలు చెరవేశారని ఆరోపణలతో కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *